Asianet News TeluguAsianet News Telugu

తిన‌డానికి చ‌పాతీ ఇవ్వ‌లేద‌ని రిక్షా కార్మికుడి దారుణ హ‌త్య‌., ఎక్క‌డంటే ?

తినడానికి చపాతీ ఇవ్వలేదని కారణంతో ఓ వ్యక్తి రిక్షా కార్మికుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ జరుపుతున్నారు. 

A rickshaw puller was brutally murdered for not being given chapati to eat.. An incident in Delhi
Author
New Delhi, First Published Jul 28, 2022, 10:54 AM IST

ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో దారుణ హత్య వెలుగు చూసింది. తిన‌డానికి చపాతీ ఇవ్వ‌లేద‌ని ఓ రిక్షా కార్మికుడిని ఘోరంగా హతమార్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో నిందితుడిని పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన 6 గంటల తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

‘నేనేం చేస్తుంటానో తెలుసా?’ అని అడిగిన మోదీకి... షాకిచ్చిన ఎనిమిదేళ్ల చిన్నారి..

ఈ ఘటనకు సంబంధించి లఖన్ అనే ప్ర‌త్య‌క్ష సాక్షి, పోలీసులు వెల్లడించిన తెలిపిన వివరాల ప్రకారం.. కరోల్ బాగ్‌లోని ఆర్యసమాజ్ రోడ్డులోని ఫుట్‌పాత్‌పై 40 ఏళ్ల వయసు గల మున్నా అనే రిక్షా కార్మికుడు భోజనం చేస్తున్నాడు. అతడు హోటల్ నుంచి భోజనం తెచ్చుకున్నాడు. ఇదే స‌మ‌యంలో మ‌ద్యం మ‌త్తులో ఒక వ్య‌క్తి అక్క‌డికి వ‌చ్చాడు. త‌న‌కు చ‌పాతీ ఇవ్వాల‌ని కోరాడు. దీంతో మున్నా తింటున్న చపాతీల్లో నుంచి ఒక దానిని అత‌డికి ఇచ్చాడు. అయితే త‌న‌కు మ‌ళ్లీ చ‌పాతీ కావాల‌ని కోరాడు. దీంతో రిక్షా కార్మికుడు ఇక ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పాడు. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం చెల‌రేగింది. 

ఘోరం.. ఒకే చెట్టుకు ముగ్గురు గిరిజ‌న అక్కాచెల్లెల్ల‌ ఉరి.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఘ‌ట‌న

మద్యం మత్తులో ఉన్న వ్యక్తి అరుస్తూ దుర్భాషలాడాడు. ఇది తీవ్ర ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. దీంతో నిందితుడు క‌త్తి తీసి మున్నాను క‌త్తితో పొడిచాడు. దీంతో అత‌డు కింద‌ప‌డిపోయాడు. ప్రత్యక్ష సాక్షి నిందితుడిని ప‌ట్టుకోవ‌డానికి 400-500 మీటర్ల వరకు వెంబడించాడు. కానీ అత‌డిని ప‌ట్టుకోలేక‌పోయాడు. వెంట‌నే మున్నాను ఆటో రిక్షాలో స్థానిక RML ఆసుపత్రికి తరలించారు. అక్క‌డ చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి అత‌డు మృతి చెందాడు. 

ఈ ఘ‌ట‌న‌పై ఢిల్లీలోని సెంట్రల్ డిస్ట్రిక్ట్ DCP శ్వేతా చౌహాన్ మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి 10:20 గంటలకు వీధి నెం -35 బిదాన్‌పురాలో ఓ వ్య‌క్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడని కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చిందని తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్క‌డికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న మున్నాను ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి తరలించార‌ని చెప్పారు. అయితే అక్క‌డికి వెళ్లిన త‌రువాత అత‌డు మృతి చెందాడ‌ని డాక్ట‌ర్లు నిర్దారించార‌ని తెలిపారు. 

అర్పితా ముఖర్జీ మరో ఇంట్లో రూ. 28 కోట్ల నగదు.. బాత్‌రూమ్‌లో కూడా నోట్ల కట్టలు..

కాగా.. ఈ హ‌త్య‌పై పోలీసులు విచార‌ణ జ‌రిపారు. రోడ్డు ప‌క్కన, పార్క్ ప్రాంతంలో ఉండే కూలీలు, వీధి వ్యాపారులు, అనుమానితులందరి గురించారు. వారి నుంచి వివ‌రాలు సేక‌రించారు. అనంత‌రం తీవ్రంగా శ్రమించారు. చివ‌రికి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కరోల్ బాగ్ పార్కులో నిద్రిస్తున్న నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. అత‌డిని విచారిస్తే నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఫిరోజ్ ఖాన్ అలియాస్ మన్ను (26)గా గుర్తించారు. నిందితుడి నుంచి నేరానికి ఉప‌యోగించిన క‌త్తిని స్వాధీనం చేసుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios