పాటలు నేర్చుకునేందుకు చర్చి ఫాదర్ దగ్గరకు యువతి వెళ్లింది. ఆమె అవసరాన్ని అలుసుగా తీసుకున్న ఆ ఫాదర్.. యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇలా ఐదేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతూనే ఉన్నాడు. అతడి వేధింపులు భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. దివ్యాంగులు అని జాలి కూడా చూపకుండా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా తమిళనాడులో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువతిపై చర్చి ఫాదర్ ఐదు సంవత్సరాల పాటు అత్యాచారానికి ఒడిగట్టాడు.

దారుణం.. రోడ్డుపై నిలబడిన స్కూటీని ఢీకొట్టి, ఈడ్చుకెళ్లిన కారు.. ఎనిమిదేళ్ల చిన్నారి మృతి.. (వీడియో)

వివరాలు ఇలా ఉన్నాయి. తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి ప్రాంతంలోని కడంపూర్ కు చెందిన 20 ఏళ్ల యువతికి పాటలు పాడటం ఇష్టం. దీంతో ఆమె 2018లో పాటలు నేర్చుకోవడానికి ఆ సమయంలో చర్చి ఫాదర్ గా పని చేసిన 40 ఏళ్ల వినోద్‌ జోస్వర్‌ దగ్గరకు వెళ్లింది. అయితే ఆమె అవసరాన్ని అతడు అలుసుగా తీసుకున్నాడు. పాటలు నేర్చుకునేందుకు తన దగ్గరికి వచ్చిన యువతిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు.

వివాహేతర సంబంధానికి అడ్డుచెప్పాడని భర్తను హత్య చేసిన భార్య.. జీవిత ఖైదు విధించిన ఎల్బీనగర్ కోర్టు

ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని ఆమెను బెదిరించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించాడు. ఇక అప్పటి నుంచి అతడు ఆ యువతిపై అత్యాచారానికి ఒడిగడుతూనే ఉన్నాడు. వినోద్‌ జోస్వర్‌ వేధింపులు ఎక్కువవడంతో దానిని భరించలేక బాధితురాలు కడంబూర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌ ను ఆశ్రయించింది. తనపై చర్చి ఫాదర్ జరిపిన లైంగిక దాడి ఘటనను వారికి వివరించి, ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా నిందితుడిని అరెస్టు చేశారు.