Asianet News TeluguAsianet News Telugu

హిందూ యువతితో కలిసి ఉన్న ముస్లిం యువకుడు.. చితకబాది పోలీసులకు అప్పగించిన భజరంగ్ దళ్ కార్యకర్తలు..

మధ్యప్రదేశ్ రాజధానిలో ఇండోర్ లో ఓ ముస్లిం యువకుడిని భజరంగ్ దళ్ కార్యకర్తలు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆ యువకుడు తనను తాను హిందువుగా పరిచయం చేసుకొని ఓ హిందూ యువతితో చనువుగా మెలిగాడు. ఇది భగజరంగ్ దళ్ కార్యకర్తలకు కోపం తెప్పించింది. 

A Muslim youth was beaten up by Bajrang Dal workers for being with a Hindu girl
Author
First Published Nov 21, 2022, 12:08 PM IST

హిందువు అని పరిచయం చేసుకొని మరో హిందూ యువతితో కలిసి ఉన్న ముస్లిం యువకుడిని భజరంగ్ దళ్ కార్యకర్తలు చితకబాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. లవ్ జిహాదీలపై చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్ లో డిమాండ్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటు చేసుకుంది. 

పాకెట్ లో ఫోన్ ఉంటే.... 1919నాటి కార్టూన్ షేర్ చేసిన శశిథరూర్...!

వివరాలు ఇలా ఉన్నాయి. ఇండోర్ లోని ఓ కేఫ్ లో ఓ ముస్లిం యువకుడు తన గుర్తింపు దాచి పెట్టి హిందూ యువతిని తరచూ కలుస్తున్నాడు. ఈ విషయంపై భజరంగ్ దళ్ కార్యకర్తలకు సమాచారం అందింది. దీంతో ఆదివారం ఆ కేఫ్ లో ఆ యువతీ, యువకులు ఉన్న సమయంలో భజరంగ్ దళ్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఆ యువకుడి దగ్గరకు వెళ్లి పేరు చెప్పాలని కోరారు. దీంతో అతడు తనను తాను కాశీగా పరిచయం చేసుకున్నాడు. నిజమైన పేరు చెప్పాలని గట్టిగా నిలదీశారు. చివరికి ఆ యువకుడి వద్ద ఉన్న గుర్తింపు కార్డును తీసుకొని చూశారు. అందులో అతడి పేరు ఖాసిం ఖాన్ అని తేలింది.

భార్యపై అనుమానం.. దారుణంగా హత్య చేసి, శరీరాన్ని రెండుగా నరికి అడవిలో పాతిపెట్టిన భర్త..

ఇది భజరంగ్ దళ్ కార్యకర్తలకు కోపం తెప్పించింది. వారంతా కలిసి అక్కడే ఆ యువకుడిని అక్కడే చితకబాదారు. తరువాత ఆ యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించారు. భజరంగ్ దళ్ కార్యకర్తలు అతడిని పట్టుకొని ఛత్రిపుర పోలీసులకు అప్పగించారు. అనంతరం బజరంగ్ దళ్ కన్వీనర్ తన్ను శర్మ వందలాది మంది కార్యకర్తలతో ఛత్రిపుర పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. లవ్ జిహాదీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రైల్వేస్టేషన్‌‌లో పట్టాలు తప్పి గూడ్స్ రైలు.. ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన వ్యాగన్లు.. ముగ్గురు మృతి

ఇలాంటి ఘటనే నవంబర్ 19న ఇండోర్ లోని మేఘదూత్ గార్డెన్ లో వెలుగులోకి వచ్చింది. మేఘదూత్ గార్డెన్ లో ఓ హిందూ యువతితో ఓ ముస్లిం యువకుడు ఉన్నాడు. ఆ సమయంలో ఓ హిందూ సంస్థ కార్యకర్తలు ఆ యువకుడిని పట్టుకున్నారు. అతడు కూడా తనను తాను హిందువని పరిచయం చేసుకున్నాడని వార్తలు వచ్చాయని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. భజరంగ్ దళ్ కార్యకర్తల ముందు యువకులు తన గుర్తింపును దాచేందుకు ప్రయత్నించారు. చివరికి వారు పదే పదే ప్రశ్నించడంతో తాను ముస్లిం అని యువకుడు అంగీకరించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios