Asianet News TeluguAsianet News Telugu

పాకెట్ లో ఫోన్ ఉంటే.... 1919నాటి కార్టూన్ షేర్ చేసిన శశిథరూర్...!

ఫోన్ లు అందుబాటులో లేని సమయంలో... చేతిలో ఫోన్ ఉంటే ఎలా ఉంటుంది..? పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని 1919లోనే ఓ కార్టూన్ రూపంలో తెలియజేశారు. ఈ కార్టూన్ ని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ షేర్ చేశారు. 

Shashi Tharoor shares 1919 cartoon predicting impact of mobile phones.
Author
First Published Nov 21, 2022, 11:25 AM IST

ప్రస్తుతం మన జీవితం మొత్తం స్మార్ట్ ఫోన్ లతో ముడిపడిపోయింది.  చేతిలో  ఫోన్ లేనివారంటూ ఎవరూ ఉండటం లేదు. చిన్న పిల్లలకు సైతం పర్సనల్ గా ఫోన్ లు ఉపయోగిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా.. ఫోన్ వెంట ఉండాల్సిందే. అంతెందుకు ఇంట్లోకి వస్తువుల దగ్గర నుంచి... ఒంటి మీద దుస్తులు, తినే ఆహారం... ఇలా అన్నింటినీ ఫోన్ లోనే కొనుగోలు చేస్తున్నారు. రోజులో 20 గంటలకు పైగా  ఫోన్ లో గడిపేస్తున్నారు. అయితే... ఇప్పుడంటే ఫోన్ లు ఉన్నాయి కాబట్టి.. లైఫ్ ఇలా ఉంది అని చెప్పేస్తున్నాం. కానీ... ఫోన్ లు అందుబాటులో లేని సమయంలో... చేతిలో ఫోన్ ఉంటే ఎలా ఉంటుంది..? పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని 1919లోనే ఓ కార్టూన్ రూపంలో తెలియజేశారు. ఈ కార్టూన్ ని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ షేర్ చేశారు. 


ఈ ట్వీట్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ ట్వీట్ లో చూపించినదంతా 100 శాతం కరెక్టే కదా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మన పాకెట్ లో ఫోన్ ఉంటే... ఇలా జరుగుతుంది అంటూ... అప్పట్లోనే ఊహించి ట్వీట్ వేయడం... అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  ఎంత ముందు చూపుతో ఊహించారో అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కార్టూన్‌లో ఓ వ్యక్తికి సంబంధించి వివిధ సందర్భాల్లో ఫోన్‌ మోగితే ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడు అనేది సూచిస్తోంది.

ఆ కార్టూన్ ప్రకారం... ఓ వ్యక్తి రైలు కోసం పరిగెత్తుతున్నప్పుడు ఫోన్ వస్తే...  ఓ వ్యక్తి... చేతి నిండా లగేజ్ ఉన్నప్పుడు ఫోన్ వస్తే.... ఓ వ్యక్తి వర్షంలో నడుస్తుండగా.... ఫోన్ మోగితే... ఓ తల్లి తన చేతిలోని చంటిబిడ్డను ఆ బిడ్డ తండ్రికి అందిస్తున్నప్పుడు, పెళ్లి  సమయంలో మొబైల్‌ ఫోన్‌ మోగితే ఎలా ఉంటుందో ఆ కార్టూన్‌ చెబుతోంది. మొబైల్ ఫోన్ అందుబాటులోకి రాని సమయంలో.. ఈ కార్టూన్ వేయడం విశేషం.
 

Follow Us:
Download App:
  • android
  • ios