ఓ ముస్లిం యువకుడితో దళిత వివాహితకు ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వారి మధ్య ప్రేమకు దారి తీసింది. కొంత కాలం తరువాత వారిద్దరూ ముంబైకి వెళ్లిపోయారు. అక్కడ ఆమె మతం మార్చి వివాహం చేసుకున్నాడు. 

ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్థ్ నగర్ జిల్లా మిశ్రులియా పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మత మార్పిడుల కేసు వెలుగులోకి వచ్చింది. దళిత కుటుంబానికి చెందిన ఓ వివాహితతో ముస్లిం మతానికి చెందిన యువకుడు ఫేస్ బుక్ లో స్నేహం చేశాడు. అది వారి మధ్య ప్రేమకు దారి తీసింది. అనంతరం వారిద్దరు కుటుంబ సభ్యులను వదిలేసి వెళ్లిపోయారు. ముంబైకి వెళ్లారు. అక్కడ ఆమెను మతం మార్చి, పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ప్రభుత్వం రక్షిస్తోంది.. అరెస్టు తప్పా అంతా జరుగుతోంది - రెజ్లర్ వినేశ్ ఫొగట్

‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. సిద్ధార్థ్ నగర్ జిల్లాలో దళిత సామాజిక వర్గానికి చెందిన లక్ష్మికి శైలేష్ కుమార్ అనే వ్యక్తితో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. కొంత కాలం కిందట అదే జిల్లాలోని సిస్వాన్ గ్రామానికి చెందిన సజవుల్లా తో ఆమెకు ఫేస్ బుక్ ద్వారా స్నేహం ఏర్పడింది. దీంతో వారి మధ్య సానిహిత్యం పెరిగింది. అనంతరం అది ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

గంగా జమ్నా స్కూల్ హిజాబ్ వివాదం : ప్రిన్సిపల్ తో పాటు మరో ఇద్దరి అరెస్ట్.. అసలేం జరిగిందంటే ?

ఈ క్రమంలో మే 31వ తేదీ రాత్రి లక్ష్మి రూ.55 వేలు, బంగారు నగలు తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. సజవుల్లా ఆమెను తీసుకొని, కొందరు స్నేహితులతో కలిసి ముంబైకి వెళ్లాడు. అక్కడ ఆమెను మతం మార్చాడు. దీంతో ఆమె పేరు లక్ష్మి నుంచి ముస్కాన్ గా మారింది. అనంతరం ముస్కాన్ ను నిఖా చేసుకున్నాడు. అయితే లక్ష్మి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సజవుల్లాతో కలిసి ఆమె ముంబై వెళ్లినట్టు గుర్తించారు. 

బెంగళూరులోని చోర్ బజార్ లో డచ్ యూట్యూబర్ కు చేదు అనుభవం.. వ్లాగింగ్ చేస్తుండగా దాడి.. నెటిజన్ల ఆగ్రహం

అనంతరం యువతి బంధువులు ముంబైకి చేరుకున్నారు. అక్కడ ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి స్వగ్రామానికి తీసుకొచ్చారు. అయితే లక్ష్మి బంధువుతో మాట్లాడిన తర్వాతే తన భార్యకు, సజవుల్లాకు ఉన్న సంబంధం గురించి తెలిసిందని శైలేష్ ‘ఇండియా టుడే’తో చెప్పారు. కాగా.. ఈ ఘటనపై నిందితుడితో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేశామని సిద్ధార్థనగర్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. వారిపై ఐపీసీ సెక్షన్ 504, 506, ఎస్సీ, ఎస్టీ చట్టం, ఉత్తరప్రదేశ్ మతమార్పిడి నిరోధక చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.