Asianet News TeluguAsianet News Telugu

తాంత్రికుడి మాటలు విని నాలుగు నెలల కుమారుడిని కాళీమాతకు బలిచ్చిన తల్లి.. యూపీలో ఘటన

ఓ తల్లి తన నాలుగేళ్ల కుమారుడి పట్ల కర్కశంగా వ్యవహరించింది. కాళీ మాతకు బలివ్వాలంటూ దారుణంగా హతమార్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్‌ జిల్లాలో జరిగింది. 

A mother gave up her four-month-old son to Mother Kali after hearing the words of the sage.. Incident in UP
Author
First Published Jan 9, 2023, 10:55 AM IST

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ తాంత్రికుడి మాటలు విని ఓ తల్లి తన కుమారుడిని బలి ఇచ్చింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

దారుణం.. శృంగారం నిరాకరించిందని భార్యను హతమార్చిన భర్త.. ఎక్కడంటే ?

వివరాలు ఇలా ఉన్నాయి. సుల్తాన్‌పూర్‌ జిల్లాలోని గోసాయిగంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ధనౌడీ గ్రామంలో శివ కుమార్ తన భార్య మంజు దేవి (35)తో కలిసి నివసిస్తున్నాడు. శివ కుమార్ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాలుగు నెలల కిందట భార్య మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ కుటుంబ మొత్తం చాలా ఆనందించింది. 

ఇప్పుడు నేను నాన్నను కాదు, అమ్మను.. ఇద్దరు కూతుళ్ల కోసం లింగమార్పిడి చేసుకున్న తండ్రి.. ఎందుకంటే?

అయితే కొంత కాలం నుంచి మంజు దేవి ఓ తాంత్రికుడి మాయలో మునిగిపోయింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గ్రామంలోని కృష్ణ విగ్రహం ఎదుట తన నాలుగు నెలల కుమారుడిని పారతో బాది హతమార్చింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంజుదేవిని అదుపులోకి తీసుకున్నారు. 4 నెలల చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూటీపై వస్తున్న దంపతులను ఢీకొట్టి, ఈడ్చుకెళ్లిన కారు..

అయితే మంజుదేవి కొంత కాలం నుంచి మానసిక వ్యాధితో బాధపడుతోందని గ్రామస్తులు తెలిపారు. ఆమె తరచుగా వింత పనులు చేస్తూ ఉండేదని పేర్కొన్నారు. మంజుదేవి ఎవరో తాంత్రికుడి మాయలో పడిందని స్థానికులు పోలీసులకు తెలిపారు. అతడి ఆదేశాల మేరకే ఆ మహిళ తన బిడ్డను బలి ఇచ్చిందని భావిస్తున్నారు. కానీ ఆ తాంత్రికుడు ఎవరన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ అంశంపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ సోమెన్ వర్మ తెలిపారు. మంజుని కూడా విచారిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios