Asianet News TeluguAsianet News Telugu

అత్యాచారానికి పాల్పడిన యువకుడి తల్లిని గన్ తో కాల్చిన మైనర్ బాలిక.. ఢిల్లీలో ఘటన

అత్యాాచార బాధితురాలు కోపంతో నిందితుడి తల్లిని కాల్చిన ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. ప్రస్తుతం ఆ మహిళ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. ఘటనకు పాల్పడిన మైనర్ బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

A minor girl shot the mother of the youth who had committed rape with a gun.. An incident in Delhi
Author
First Published Jan 8, 2023, 11:09 AM IST

అత్యాచారానికి పాల్పడిన యువకుడి తల్లిని బాధితురాలు గన్ తో కాల్చింది. ప్రస్తుతం అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి  జైలులో ఉన్నాడు. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురాలో జరిగింది. కాల్పులు జరిపిన బాలిక వయస్సు 16 సంవత్సరాలు కాగా.. మరణించిన మహిళ వయస్సు 50 సంవత్సరాలు. మైనర్ ను అదుపులోకి తీసుకున్నట్టు ఢిల్లీ పోలీసు అధికారులు శనివారం తెలిపారు.

తూర్పు చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి.. 22 మందికి గాయాలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ పై 2021లో 25 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడు జైలులో ఉన్నాడు. అయితే బాధితురాలు ఈ విషయంలో ఆగ్రహంతో ఉంది. శనివారం సాయంత్రం నిందితుడి తల్లి వద్దకు వెళ్లింది. ఆమె తన నివాసంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఓ కిరాణా దుకాణం నడుపుతోంది. మైనర్ బాలిక తన వెంట కంట్రీ మేడ్ గన్ తీసుకొని ఆ మహిళ నడిపే కిరాణా దుకాణానికి వెళ్లి కాల్చింది. తరువాత అక్కడి నుంచి పారిపోయింది.

ఈ ఘటనలో మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆమెను స్థానికులు హాస్పిటల్ లో చేర్చారు. ప్రమాదం నుంచి ప్రస్తుతం ఆమె బయటపడిందని అధికారులు తెలిపారు. దీనిపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈశాన్య) సంజయ్ కుమార్ సైన్ మాట్లాడుతూ.. భజన్‌పురాలోని ఘోండా ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నట్లు పోలీసు కంట్రోల్ రూమ్‌కు సాయంత్రం 5.30 గంటలకు కాల్ వచ్చిందని తెలిపారు. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికే ఆమె గాయాలతో ఉందని పేర్కొన్నారు. బాధితురాలిని స్థానికులు జగ్ ప్రవేశ్ చంద్ర ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పారు.స

జమ్మూకాశ్మీర్ లోని బాలాకోట్‌లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

బాలికను గంటల వ్యవధిలోనే పట్టుకున్నామని, ఆమె ఉపయోగించిన కంట్రీ మేడ్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. ‘‘ 2021లో తనపై మహిళ కుమారుడు అత్యాచారం చేశాడని బాలిక ఆరోపించింది. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. అతడు అరెస్టు అయ్యాడు. ఇప్పటికీ జైలులో ఉన్నాడు.’’ అని ఓ అధికారి చెప్పారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది.

వరుస హత్యలతో బెంబెలెత్తిస్తున్న సైకో కిల్లర్.. ఇప్పటి వరకూ మూడు హత్యలు.. హంతకుడిపై రూ. 25 వేల రివార్డు ..

నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేసినా కూడా బాలిక మహిళపై ఎందుకు కాల్పులు జరిపిందనేది ఇంకా నిర్ధారణ కాలేదని మరో అధికారి తెలిపారు. ‘‘ దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. అమ్మాయిని సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఈ ఘటనకు గల కారణాలు స్పష్టంగా తెలుస్తాయి. దీని కోసం బాలిక కుటుంబ సభ్యులు, నిందితుడి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నాంఅని అధికారి తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios