Asianet News TeluguAsianet News Telugu

తూర్పు చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి.. 22 మందికి గాయాలు

చైనాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. రోడ్లపై దట్టమైన పొగమంచు పేరుకుపోయి ఉండటం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. 

Fatal road accident in East China 17 people died.. 22 people were injured
Author
First Published Jan 8, 2023, 9:47 AM IST

తూర్పు చైనాలో జియాంగ్జీ ప్రావిన్స్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మరో 22 మందికి గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. ‘‘ ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు. 22 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు’’ అని అధికారులు తెలిపారని స్టేట్ బ్రాడ్‌కాస్టర్ ‘సీసీటీవీ’ నివేదించింది.

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై నటి జమీలా జామిల్ విమర్శలు.. బూతులు ఉపయోగించి మరీ..

నాన్‌చాంగ్ కౌంటీలోని ప్రధాన రహదారిపై తెల్లవారుజామున 1 గంటలకు (1700 జీఎంటీ) ప్రమాదం జరిగిందని తెలిపింది. ప్రమాదానికి గల కారణాలపై లోతైన విచారణ జరుగుతోందని సీసీటీవీ పేర్కొంది. ఈ ఘటన జరిగిన గంట తరువాత నాన్‌చాంగ్ కౌంటీ ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పొగ మంచు పేరుకుపోయిన నేపథ్యంలో డ్రైవింగ్ చేసే విధానంపై డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.

‘‘డ్రైవింగ్ విజిబిలిటీ తక్కువగా ఉంది. ఇది ట్రాఫిక్ ప్రమాదాలకు కారణమవుతుంది. దయచేసి ఫాగ్ లైట్లు ఆన్ చేయండి. వేగాన్ని తగ్గించండి. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ముందు ఉన్న కారు నుండి సురక్షితమైన దూరం పాటించండి. పాదచారులను గమనించండి. లేన్‌లను మార్చొద్దు. ఓవర్ టేక్ చేయొద్దు. ’’ అని పొలీసులు సూచించారు. కాగా కఠినమైన భద్రతా నియంత్రణలు లేకపోవడం వల్ల చైనాలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగానే జరుగుతుంటాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios