Asianet News TeluguAsianet News Telugu

 వరుస హత్యలతో బెంబెలెత్తిస్తున్న సైకో కిల్లర్.. ఇప్పటి వరకూ మూడు హత్యలు.. హంతకుడిపై రూ. 25 వేల రివార్డు ..

ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లాలో వరుస హత్యలతో సైకో కిల్లర్ బెంబెలెత్తిస్తున్నారు. వృద్ధ మహిళలపై టార్గెట్ చేసుకున్న ఆ దుర్మాగుడు అత్యాచారాలకు, హత్యలకు పాల్పడుతున్నాడు. ఈ కిల్లర్ ఆగడాలు మితిమిరాడంతో .. అతనిపై పోలీసులు 25 వేల రివార్డు ప్రకటించారు. 

Serial killer targeting older women on the loose in UP's Barabanki, killed 3 so far
Author
First Published Jan 8, 2023, 6:45 AM IST

ఉత్తరప్రదేశ్ లోని బారాబంకి జిల్లాలో వరుస హత్యలతో సైకో కిల్లర్ బెంబెలెత్తిస్తున్నారు. వృద్ధ మహిళలపై టార్గెట్ చేస్తున్న ఆ దుర్మాగుడు  వారిపై అత్యాచారాలకు పాల్పడి.. అత్యంత దారుణంగా హతమార్చుతున్నాడు. వరుస హత్యలతో స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నాడు. బారాబంకి జిల్లాలోని అడవి ప్రాంతంలో సంచరిస్తున్న సైకో కిల్లర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఈ క్రమంతో మావాయి, పత్రాంగ , బారాబంకి చెందిన పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి అడవిలో కూంబింగ్‌ చేస్తున్నారు. అదే సమయంలో నిందితుడి ఫొటోను పోలీసులు విడుదల చేశారు. హంతకుడిని పట్టుకోవడంలో సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైకో కిల్లర్ ఇప్పటివరకు మూడు హత్యలు చేసినట్లు సమాచారం.  

వివరాల్లోకెళ్తే.. అయోధ్య జిల్లాలోని మావాయి పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 5, 2022న మావాయిలోని ఖుశెటి గ్రామానికి చెందిన 60 ఏళ్ల మహిళ ఏదో పని కోసం ఇంటి నుండి బయలుదేరింది. సాయంత్రం వరకు ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు (డిసెంబర్ 6) మధ్యాహ్నం ఆమె మృతదేహాన్ని పోలీసులు  కనుగొన్నారు. ఆ వృద్దురాలిని అత్యాచారం చేసి.. హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. మహిళ ముఖం, తలపై బండరాయితో కొట్టినట్టు గాయాలను గుర్తించారు. అత్యాచారం చేసిన తర్వాత ఆమె గొంతుకోసి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అయితే నిందితుడు ఎవరో ఎవరికీ తెలియలేదు.

రెండో హత్య .. బారాబంకి జిల్లాలోని రామ్‌స్నేహిఘాట్ కొత్వాలికి 4 కి.మీ దూరంలో ఇబ్రహీమాబాద్ అనే గ్రామం ఉంది. 17 డిసెంబర్ 2022న ఆ గ్రామానికి చెందిన 62 ఏళ్ల వృద్ధురాలి మృతదేహం ఒక పొలంలో అనుమానస్పదంగా పడి ఉంది. ఈ శవంపై కూడా బట్టలు లేకపోవడం.. తలపై గాయాలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం వృద్ధురాలి శవాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. ఈ కేసులో కూడా నిందితుడి గురించి ఎలాంటి ఆధారాలు లభించలేవు. ఈ ఘటనలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు  వారి వారి స్థాయిలలో దర్యాప్తు ప్రారంభించారు. 

ఈ క్రమంలో డిసెంబర్ 29 న రామ్స్నేహిఘాట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని తథార్హా గ్రామంలో మలవిసర్జన కోసం బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. ఆమె మృతదేహం మరుసటి రోజు (డిసెంబర్ 30న) గ్రామానికి సమీపంలో ఉన్న పొలంలో బట్టలు లేకుండా కనిపించింది. ఈ మహిళ వయస్సు 55 సంవత్సరాలు, గతంలో జరిగిన హత్యలకు ఈ హత్యలకు సరూప్యత ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.   

రూ. 25 వేల రివార్డు ప్రకటన

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు  దర్యాప్తును వేగవంతం చేశారు. మావాయిలోని కుషారీ, రామ్‌దిన్‌ పూర్వా, అష్రఫ్‌ నగర్‌, అమాహియా , పత్రాంగ సుల్తాన్‌పూర్‌, గాంగ్రేలా, రాణిమౌ గ్రామస్థులను పోలీసులు తరుచు విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల పెద్దల నుంచి కూడా సహకరించాలని కోరారు. బారాబంకి పోలీసులు వారం రోజులుగా గ్రామానికి వస్తున్నారని రాణిమౌ సునీల్ మిశ్రా, సుల్తాన్‌పూర్‌కు చెందిన ధర్మేంద్ర సింగ్‌ ప్రధాన ప్రతినిధి తెలిపారు. పోలీసులు అనుమానితుడి ఫోటో చూపించి గ్రామస్తులను అడిగారు. విచారణ కొనసాగుతోందని మావాయి ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ ఓంప్రకాష్ తివారీ తెలిపారు. రాంసనేహి ఘాట్ కొత్వాలి సరిహద్దు గ్రామాలలో బారాబంకి పోలీసుల అనేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. బారాబంకి పోలీసులు అతడిపై 25 వేల రివార్డును ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios