Asianet News TeluguAsianet News Telugu

జమ్మూకాశ్మీర్ లోని బాలాకోట్‌లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఆదివారం ఉదయం ప్రారంభించిన ఈ ఎన్ కౌంటర్ లో సైన్యం విజయం సాధించింది. బీజీ సెక్టార్‌లోని బాలాకోట్‌లోని దేరీ దబ్సీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. 

Encounter in Balakot in Jammu and Kashmir.. Two terrorists were killed
Author
First Published Jan 8, 2023, 9:03 AM IST

జమ్మూకశ్మీర్‌లోని బాలాకోట్‌లో ఆదివారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. గత అర్థరాత్రి అనుమానాస్పద కదలికలను గుర్తించిన భారత సైన్యం కొంత సమయం పాటు కాల్పులు జరిపింది. అయితే ఆ సమయంలో ఎవరూ సైన్యానికి చిక్కకలేదు. దీంతో భద్రతా దళాలను సరిహద్దు కంచెపై మోహరించారు. ఉదయం సమయంలో కాల్పులు జరిగి ఉగ్రవాదులను హతమర్చాయి.

మళ్లీ ఢిల్లీ తరహా యాక్సిడెంట్.. యూపీలో స్కూల్ స్టూడెంట్ ను ఢీకొట్టి కిలోమీటరు ఈడ్చుకెళ్లిన కారు..

బీజీ సెక్టార్‌లోని బాలాకోట్‌లోని దేరీ దబ్సీ ప్రాంతంలోని నియంత్రణ రేఖ సమీపంలో కొన్ని అనుమానాస్పద కదలికలు కనిపించడంతో ఈ చర్యకు పూనుకున్నారు. ‘‘ రాత్రి 7.50 గంటలకు పూంచ్‌లోని ఎల్‌ఓసిలోని బాలాకోట్ సెక్టార్‌లో 19 మద్రాస్‌లోని 638 పోస్ట్‌కు సమీపంలో అనుమానాస్పద కదలికను గమనించాం. తరువాత సైన్యం సుమారు 5 నిమిషాల పాటు కాల్పులు జరిపింది’’ అని రక్షణ వర్గాలు తెలిపినట్టు వార్తా సంస్థ ‘ఐఏఎన్ఎస్’ నివేదించింది.

ఢిల్లీలో కుప్పకూలిన బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు..

లోయలో హిందువుల హత్యలు ప్రజలలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించిన నేపథ్యంలో తాజా విజయం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరిలో హిందువుల ఇళ్లలోకి ముష్కరులు చొరబడి ఐదుగురు పౌరులను చంపేశారు. ఒక రోజు తరువాత ఆ ఇళ్ల సమీపంలోనే పేలుడు జరిగింది. దీంతో ఓ పిల్లాడు మరణించాడు. నలుగురు గాయపడ్డారు.

వరుస హత్యలతో బెంబెలెత్తిస్తున్న సైకో కిల్లర్.. ఇప్పటి వరకూ మూడు హత్యలు.. హంతకుడిపై రూ. 25 వేల రివార్డు ..

అయితే ఆదివారం జరిగిన ఘటనను నిరసిస్తూ రాజౌరి ప్రజలు ఆందోళనలు చేశారు. సమ్మెలు నిర్వహించారు. లోకల్ అడ్మినిస్ట్రేషన్ భద్రతా లోపమే దీనికి కారణమని స్థానికులు నిందించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), భారత సైన్యం ఈ హత్యల వెనుక ఉన్న ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో సోదాలు ప్రారంభించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios