నల్లగా ఉందని భార్యను హతమార్చిన భర్త.. కర్నాటకలో ఘటన

కర్ణాటకలో దారుణం జరిగింది. నల్లగా ఉందనే కారణంతో ఓ భర్త తన భార్యను చంపేశాడు. ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. 

A husband who killed his wife because she was black.. An incident in Karnataka

నల్లగా ఉందన్న కారణంతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఈ విచిత్ర ఘటన కర్నాటక రాష్ట్రంలో బుధవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కథనం ప్రకారం.. జేవర్గి తాలూకాలోని కెల్లూరు గ్రామంలో ఖాజా పటేల్‌ అనే వ్యక్తి ఏడు సంవత్సరాల కిందట యాద్గిర్ జిల్లా షాహాపూర్ తాలూకాకు చెందిన ఫర్జానా బేగం (28) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మియో కమ్యూనిటీ కోసం మేవాట్‌లో తొలి ప్రైవేట్ యూనివర్సిటీ ప్రారంభించనున్న యూసుఫ్ ఖాన్

అయితే ఫర్జానా బేగం చర్మం రంగు విషయంలో పటేల్ ఆమెను తరచూ చిత్రహింసలకు గురిచేసేవాడు. ఆమె ముఖానికి ఎంత పౌడర్ వేసినా హీరోయిన్ రూపం రావడం లేదని ఆమెను ఎప్పుడూ దూషించేవాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రుల దృష్టికి కూడా తీసుకెళ్లింది. కానీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు.

దీంతో పాటు పటేల్, అతడి కుటుంబ సభ్యులు బాధితురాలిని మరింత కట్నం డిమాండ్ చేస్తూ చిత్రహింసలకు గురి చేశారని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’తో కెల్లూరులోని పాల వ్యాపారి ఖుర్షీద్‌ తెలిపారు. ఈ క్రమంలో ఆమెను నిందితుడు బుధవారం గొంతు కోసి హత్య చేశాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఖాజా పటేల్‌పై కుటుంబీకులు జేవర్గి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

భారత్ లో ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి జరుగుతోంది - రాహుల్ గాంధీ

పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని కలబురగి హాస్పిటల్ కు తరలించారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం శహాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి ఇద్దరు పిల్లలను తల్లిదండ్రులు తమ వెంట తీసుకెళ్లారు. కాగా.. ప్రస్తుతం నిందితుడు, అతడి కుటుంబం పరారీలో ఉంది. నిందితుడిపై కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారని కలబురగి రూరల్ డీఎస్పీ ఉమేష్ చిక్‌మత్ తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఆయన అన్నారు.

కర్ణాటకలో బీజేపీకి దెబ్బ! లంచంతో పట్టుబడ్డ ఎమ్మెల్యే కుమారుడు.. కేఎస్‌డీఎల్ చైర్మన్‌గా తప్పుకున్న ఎమ్మెల్యే

ఇదిలా ఉండగా.. ఫర్జానా మృతికి గల కారణాలను తెలుసుకోవడానికి తమ బృందాన్ని కెల్లూరుకు పంపనున్నట్లు జనవాది మహిళా సంఘం (జేఎంఎస్‌) రాష్ట్ర యూనిట్‌ ఉపాధ్యక్షురాలు నీల కే తెలిపారు. చిత్రహింసల వల్ల బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నా కూడా ఆ మరణాన్ని హత్యగానే పరిగణిస్తామని ఆమె తెలిపారు ఈ ఘటనపై మహిళా హక్కుల కమిషన్‌ సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్‌ ఆమె చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios