భారత్ లో ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి జరుగుతోంది - రాహుల్ గాంధీ

భారత్ లో ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి జరుగుతోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలోని అనేక మంది రాజకీయ నాయకుల ఫోన్లలో ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్ ఉందని అన్నారు. యూకే పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో మాట్లాడారు. 

 

There is a direct attack on democracy in India - Rahul Gandhi..

కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీని, ఎన్డీయే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి జరుగుతోందని ఆయన ఆరోపించారు. మీడియాను, న్యాయవ్యవస్థను కబ్జా చేశారని, ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని అన్నారు. మైనార్టీలు, గిరిజనులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు.

సోనియా గాంధీకి అస్వస్థత.. హాస్పిటల్‌లో చేరిక.. వైద్యులు ఏం చెప్పారంటే?

బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ శుక్రవారం కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి వెళ్లి ప్రసంగించారు. భారతదేశంలోని పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకుల ఫోన్‌లలో పెగాసస్ ఉందని ఆయన పేర్కొన్నారు. తన ఫోన్‌లో కూడా ఆ స్పైయింగ్ సాఫ్ట్‌వేర్ ఉందని తెలిపారు. ఫోన్‌లో మాట్లాడే సమయంలో ఫోన్ రికార్డు అవుతోందని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఇంటిలిజెన్స్ అధికారులు తనకు సూచించారని తెలిపారు.

భారత్‌లో మేము నిరంతరం ఒత్తిడిని అనుభవిస్తున్నామని రాహుల్ గాంధీ అన్నారు. ‘‘ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారు. నాపై చాలా కేసులు పెట్టారు. మనల్ని మేము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిని బెదిరిస్తున్నారు. ’’ అని ఆయన అన్నారు. 

ఢిల్లీ మురికివాడలో అగ్నిప్రమాదం.. తొక్కిసలాటలో 8 మందికి గాయాలు..

ప్రధాని నరేంద్ర మోడీ మంచి పని చేశారా అనే ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇస్తూ ‘‘మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, బ్యాంకు ఖాతాలు తెరిపించడం మంచి విషయాలని చెప్పొచ్చు. కానీ దేశానికి ప్రధాని మోడీ వేసిన పునాది సరైనది కాదు. ఆయన భారతదేశ గుర్తింపును నాశనం చేస్తున్నారు. భారతదేశం ఎన్నటికీ అంగీకరించలేని ఆలోచనను ఆయన భారతదేశంలో ప్రయోగిస్తున్నాడు. ‘‘ఇక్కడ ఒక సిక్కు కూర్చొని ఉన్నాడు. ఆయన భారతదేశానికి చెందినవాడు. దేశంలో ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. కానీ వారు భారతదేశంలో ద్వితీయ శ్రేణి పౌరులని ప్రధాని మోడీ అంటున్నారు. దీనిని నేను అంగీకరించను’’అని రాహుల్ గాంధీ అన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios