Asianet News TeluguAsianet News Telugu

ముంబాయిలో హిందూ సంస్థల భారీ కవాతు.. లవ్ జిహాద్, మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావాలని డిమాండ్

లవ్ జిహాద్ ను అరికట్టాలని, మత మార్పిడులను నిలువరించాలని కోరుతూ హిందూ సంస్థల సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వందలాది మంది సభ్యులు ముంబైలో ర్యాలీ తీశారు. ఇందులో బీజేపీ, శివసేన నాయకులు కూడా పాల్గొన్నారు. 

A huge march by Hindu organizations in Mumbai. Demand for laws against love jihad and religious conversions.
Author
First Published Jan 30, 2023, 12:52 PM IST

మహారాష్ట్రలో లవ్ జిహాద్, మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావాలని హిందూ సంస్థల సభ్యులు డిమాండ్ చేశారు. వందలాది మంది సభ్యులు ర్యాలీగా ఏర్పడి ముంబై వీధుల గుండా భారీ కవాతు నిర్వహించారు. నాగ్‌పూర్‌లో వారం రోజుల కిందట ఇలాంటి నిరసన జరిగిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

మహాత్మా గాంధీకి ప్ర‌ముఖుల‌ నివాళులు.. ప్రేమతో జీవనం, సత్యం కోసం పోరాడాలని బాపు నేర్పించార్న‌న రాహుల్ గాంధీ

సకల్ హిందూ సమాజ్ నాయకత్వంలో ఈ నిరసన ప్రదర్శన చేపట్టారు. హిందూ జన్ ఆక్రోష్ మోర్చా పేరుతో  బ్యానర్ లు ఏర్పాటు చేసిన నిరసనకారులు సెంట్రల్ ముంబైలోని దాదర్‌లోని శివాజీ పార్క్ నుండి తమ మార్చ్‌ను ప్రారంభించారు. ఇది పరేల్‌లోని కమ్‌గర్ మైదాన్‌లో 4 కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరం సాగింది.

త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌లు: అభ్యర్థుల తొలి జాబితా ప్ర‌క‌టించిన టీఎంసీ

ఈ నిరసనలో ప్రజలు పెద్ద సంఖ్యలో కాషాయ జెండాలు, బ్యానర్‌లను పట్టుకుని, ‘‘లవ్ జిహాద్’’కు వ్యతిరేకంగా చట్టం చేయాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో మత మార్పిడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ, ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే శివసేన వర్గానికి చెందిన పలువురు నాయకులు, శాసనసభ్యులు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దారిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ర్యాలీకి ఇరువైపులా పోలీసు సిబ్బందిని మోహరించారు.

గతేడాది డిసెంబర్‌లో ‘లవ్‌ జిహాద్‌’పై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం లవ్ జిహాద్‌కు సంబంధించి ఇతర రాష్ట్రాలు రూపొందించిన చట్టాలను ప్రభుత్వం అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కాగా.. ముస్లిం పురుషులు హిందూ స్త్రీలను వివాహం చేసుకొని, తరువాత మతమార్పిడికి గురిచేయడాన్ని సూచించడానికి ఈ ‘లవ్ జిహాద్’ అనే పదాన్ని ఉపయోగిస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios