త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు: అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన టీఎంసీ
Agartala: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల తొలి జాబితాను తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసింది. రాబోయే త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామనీ, తమ పార్టీ విజయం సాధిస్తుందని రజీబ్ బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tripura Assembly Polls: త్రిపురలో అధికారం దక్కించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 22 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విడుదల చేసింది. ఎన్నికలకు తమ పార్టీ సర్వసన్నద్ధంగా ఉందని టీఎంసీ రాష్ట్ర ఇంచార్జీ రజీబ్ బెనర్జీ తెలిపారు. "రాష్ట్ర నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాత 129 మంది పేర్లను పంపించాం. పేర్లు పంపే ముందు నేతలతో సమావేశం నిర్వహించాం. రాబోయే త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. త్వరలోనే తుది జాబితాను ప్రకటిస్తాం" అని రజీబ్ బెనర్జీ తెలిపారు.
బముతియా (ఎస్సీ) స్థానం నుంచి నిహార్ రంజన్ సర్కార్ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. రాంనగర్ నిర్మల్ మజుందార్ మజ్లిస్ పూర్ నుంచి పూజాన్ బిశ్వాస్ ను బరిలోకి దింపుతోంది. కమలాసాగర్ కు చెందిన సుతాపా ఘోష్, బిషాల్ గఢ్ కు చెందిన హరదన్ దేబ్ నాథ్, బాక్సానగర్ కు చెందిన జోయ్ దల్ హుస్సేన్, సోనామురాకు చెందిన నీల్ కామా సాహా, ధన్ పూర్ కు చెందిన హబిల్ మియా, తెలియామురాకు చెందిన రబీ చౌదరి, సంతిర్బజార్ (ఎస్టీ)కు చెందిన నరేంద్ర రీయాంగ్, జోలైబరి (ఎస్టీ)కి చెందిన కాంగ్ జారి మోగ్ లు టీఎంసీ మొదటి అభ్యర్థుల జాబితాలో ఉన్నారు. అలాగే, అమర్పూర్ నియోజకవర్గం నుంచి బిప్లబ్ సాహాకు టికెట్ ఇచ్చారు. కార్బుక్ (ఎస్టీ)కు చెందిన మిల్టన్ చక్మా, కమల్ పూర్ కు చెందిన సునమ్ డే, సుర్మా (ఎస్సీ)కు చెందిన అర్జున్ నామసుద్ర, అంబాస్సా (ఎస్టీ)కు చెందిన చందన్ మోగ్, చావ్మాను (ఎస్టీ)కు చెందిన రూపయాన్ చక్మా, చండీపూర్కు చెందిన బిద్యుత్ బికాస్ సిన్హా, కైలాసహర్ కు చెందిన అబ్దుల్ మతీన్, కదంతల కుర్తికి చెందిన అబ్దుల్ హసీం, బాగ్బాసాకు చెందిన విమల్ నాథ్, పెచర్తాల్ (ఎస్టీ) స్థానం నుండి పూర్ణితా చక్మాలు అభ్యర్థుల జాబితాలో ఉన్నారు.
కాగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ త్రిపుర అసెంబ్లీలోని 60 సీట్లలో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రధాన పార్టీల ఓట్లను చీల్చడం ద్వారా ఈసారి త్రిపుర ఎన్నికల్లో టీఎంసీ కీలక పాత్ర పోషించనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం త్రిపుర భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాత మిత్రపక్షం ఐపీఎఫ్టీతో సీట్ల పంపక ఒప్పందాన్ని ఖరారు చేసింది. సంకీర్ణంలోని జూనియర్ భాగస్వామికి ఐదు స్థానాలు ఇచ్చింది. అయితే, ఇది 2018 ఎన్నికల కంటే నాలుగు స్థానాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కేంద్ర మంత్రి ప్రతిమా భూమిక్ సహా 11 మంది మహిళలతో కూడిన 48 మంది అభ్యర్థులతో కూడిన బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ 55 స్థానాల్లో పోటీ చేస్తుందని ముఖ్యమంత్రి మాణిక్ సాహా తెలిపారు. మరోసారి రాష్ట్రంలో అధికారం దక్కించుకుంటుందని తెలిపారు.
అగర్తలా అసెంబ్లీ స్థానానికి తమ అభ్యర్థిగా పాపియా దత్తా పేరును రాష్ట్రంలోని అధికార బీజేపీ ఖరారు చేసింది. తిప్రాహా ఇండిజెనియస్ ప్రోగ్రెసివ్ రీజినల్ అలయన్స్ (టిప్రా మోతా) కూడా తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాగా, జనవరి 30 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీని ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. ఫిబ్రవరి 16న పోలింగ్ జరగనుండగా, మార్చి 2న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.