New Delhi: నేడు మహాత్మాగాంధీ 75వ వర్ధంతి. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాజ్ ఘాట్ కు చేరుకుని బాపూజీకి నివాళులర్పించారు. ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స‌హా ప‌లువురు మ‌హాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.  

Mahatma Gandhi Death Anniversary: మహాత్మా గాంధీ 75వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఆయనకు నివాళులర్పించారు. రాజ్ ఘాట్ కు చేరుకుని బాపూజీకి ప్ర‌ధాని నివాళులర్పించారు. ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స‌హా ప‌లువురు మ‌హాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. 

''బాపూజీ పుణ్య తిథి సందర్భంగా ఆయనకు శిరస్సు వంచి, ఆయన గాఢమైన ఆలోచనలను స్మరించుకుంటున్నాను. దేశ సేవలో అమరులైన వారందరికీ నివాళులు అర్పిస్తున్నాను. వారి త్యాగాలు ఎన్నటికీ మరువలేనివని, అభివృద్ధి చెందిన భారతదేశం కోసం పనిచేయాలనే మా సంకల్పాన్ని బలోపేతం చేస్తాయని" ప్ర‌ధాని మోడీ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

1948లో ఇదే రోజున జాతిపిత మహాత్మాగాంధీని నాథూరాం గాడ్సే హత్య చేశారు. నేడు (జనవరి 30) మహాత్మాగాంధీ వర్ధంతి. ఈ సందర్భంగా ఢిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి రాజ్ ఘాట్ లో సర్వమత ప్రార్థనా సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖ‌ర్, ఇతర నేతలు రాజ్ ఘ‌ట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. జాతిపిత వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆయనకు సెల్యూట్ చేస్తూ ట్వీట్ చేశారు. జాతిపితకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని రాహుల్ గాంధీ అన్నారు. దేశం మొత్తాన్ని ప్రేమతో, సర్వమత సామరస్యంతో జీవించాలని, సత్యం కోసం పోరాడేలా చేయాలని బాపూజీ బోధించారని అన్నారు. మహాత్మాగాంధీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు

Scroll to load tweet…

గాంధీజీకి నిజమైన నివాళి అదే..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా బాపూజీకి నివాళులు అర్పించారు. "స్వదేశీ, స్వావలంబన మార్గాన్ని అనుసరించి దేశం స్వయం సమృద్ధి సాధించేలా స్ఫూర్తినిచ్చిన మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. స్వాతంత్రోద్యమ కాలంలో పరిశుభ్రత, స్వదేశీ, స్వీయభాష అనే పూజ్య బాపూజీ ఆలోచనలను స్వీకరించడం, అనుసరించడం గాంధీజీకి నిజమైన నివాళి" అని ఆయ‌న ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…