Asianet News TeluguAsianet News Telugu

సైరస్ మిస్త్రీ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి.. నిందితురాలు పలుమార్లు .. 

పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ మృతిపై విచారణలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కారు నడుపుతున్న డాక్టర్ అనహిత పండోలే నిత్యం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారని పోలీసులు గుర్తించారు. 2020-2022లో ఆమెపై 19 ఈ-చలాన్లు జారీ చేయబడ్డాయనీ, వీటిలో 11 అతివేగంతో డ్రైవింగ్ చేసిన కేసులేనని గుర్తించారు.

Cyrus Mistry Death: Accused Had A History Of Over-Speeding, Says Police
Author
First Published Dec 15, 2022, 2:12 PM IST

పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ మృతి కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కారు నడుపుతున్న గైనకాలజిస్ట్ డాక్టర్ అనాహిత పండోలే నిత్యం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారని పోలీసులు గుర్తించారు. డాక్టర్ అనాహిత పండోల్‌కు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చరిత్ర ఉందనీ, 2020 నుండి ఆమెపై చాలా సందర్భాలలో  ఓవర్ స్పీడ్ కారణంగా చలాన్లు జారీ చేయబడిందని తెలిపారు. 2020-2022లో ఆమెపై 19 ఈ-చలాన్లు జారీ చేయబడ్డాయనీ, వీటిలో 11 అతివేగంతో డ్రైవింగ్ చేసిన కేసులేనని గుర్తించారు.

పాల్ఘర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బాలాసాహెబ్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. డా.పండోలేపై ముంబై ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన చలాన్ల వివరాలను తెలిపారు. 2020 నుండి 2022 వరకు డాక్టర్ పండోల్‌పై మొత్తం 19 ఈ-చలాన్‌లు జారీ చేయబడ్డాయని తెలిపారు. ఈ -చలాన్లలో డ్రైవింగ్ సీటులో డాక్టర్ పండోలే ఉన్నట్టు ఫోటోలలో తెలుస్తుందని అన్నారు. పలు ట్రాఫిక్ చలాన్లు  ప్రమాణానికి గురైన కారుపై కూడా ఉన్నాయనీ, అది కూడా డాక్టర్ పండోలే నడిపినప్పుడే ఆ చలాన్లు విధించబడ్డాయని తెలిపారు.ప్రమాదానికి గురైన కారు జేఎం ఫైనాన్షియల్స్ పేరుతో రిజిస్టర్ అయినట్లు తేలింది.ఆ కారును అనాహిత పండోల్ ఉపయోగించారు. 19 చలాన్లలో 17 పెనాల్టీ మొత్తం డిపాజిట్ అయినట్లు కూడా గమనించారు.

ప్రమాదానికి ముందు గంటకు 100 కి.మీ వేగం

ప్రమాదానికి ఐదు సెకన్ల ముందు వరకు సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణించిందనీ, ఢీకొనడానికి కొన్ని సెకన్ల ముందు డాక్టర్ అనాహిత పండోల్ బ్రేకులు వేశారనీ, దాని కారణంగా దాని వేగం 89 కి.మీ.కి తగ్గిందని తెలుస్తోంది. అయితే.. అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయడంతో సీటు బెల్ట్ లేకుండా వెనుక సీట్లలో కూర్చున్న మిస్త్రీ, జహంగీర్‌లకు ముందు సీట్ల వెనుక భాగంలో బలంగా ఢీ కొట్టారని.దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సైరస్ మిస్త్రీ  మృతి చెందాడు.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న వారంతా గుజరాత్‌లోని ఉద్వాడ నుంచి ముంబైకి తిరిగి వస్తున్నారు. సైరస్ మిస్త్రీ  కారు NH 48పై ఉన్న కాంక్రీట్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డాక్టర్ అనహిత పండోలె కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే..ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వైద్య బృందం నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ రాకపోవడంతో పోలీసులు అతని వాంగ్మూలాన్ని నమోదు చేయలేదు. ఛార్జిషీటు దాఖలు చేసేందుకు ఆమె వాంగ్మూలం తప్పనిసరి కాదని పోలీసులు చెబుతున్నారు.

ఈ వ్యవహారంపై ఈ వారం చివరిలోగా కోర్టులో చార్జిషీటు దాఖలు చేస్తామని బాలాసాహెబ్ పాటిల్ తెలిపారు. ప్రమాదానికి సంబంధించి డాక్టర్ అనహిత వాంగ్మూలాన్ని పోలీసులు ఇంకా నమోదు చేయలేదు. పాల్ఘర్ పోలీసులు నవంబర్‌లో డాక్టర్ అనహితపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన కేసు నమోదు చేశారు. వీరిపై మోటారు వాహనాల చట్టంతో పాటు ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) సెక్షన్ 304(ఏ), 279, 337 కింద కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios