Asianet News TeluguAsianet News Telugu

తాగుడుకు బానిసై భార్యతో గొడవ.. నాలుగు నెలల గర్భిణీకి నిప్పంటించి, కుమారుడితో పరారైన భర్త.

ఉపాధి కోల్పోయి, తాగుడుకు బానిసై ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. నాలుగు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా ఘోరంగా నిప్పంటించాడు. అనంతరం కుమారుడిని తీసుకొని పరారయ్యాడు. ఈ ఘటన తమిళనాడులోని కాంచీపురంలో చోటు చేసుకుంది.

A drunkard and a quarrel with his wife.. The husband who set fire to the four-month pregnant woman and ran away with his son..ISR
Author
First Published Oct 14, 2023, 11:11 AM IST

ఆ దంపతలకు వివాహమై ఏడేళ్లు అవుతోంది. ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల భార్య మరో సారి గర్భం దాల్చింది. చక్కగా సాగిపోతున్న కాపురం. కానీ వారి మధ్య మద్యం చిచ్చుపెట్టింది. తాగుడుకు బానిసైన భర్త భార్యతో గొడవలు పడేవాడు. రెండు రోజుల కింద కూడా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త.. గర్భిణీ అని కూడా చూడకుండా భార్యకు నిప్పంటించి హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.

ప్రకాశంలో దారుణం.. పెళ్లి చేయలేదని తండ్రిని హత్య చేసిన కొడుకు..

వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం జిల్లాలో మరైమలై నగర్ లో రాజ్ కుమార్, నందిని(28) నివసిస్తున్నారు. వీరికి ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల నందిని మరో సారి గర్భం దాల్చింది. ఆమె ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. అయితే కొంత కాలం కిందట రాజ్ కుమార్ ఉపాధి కోల్పోయాడు. అప్పటి నుంచి మరైమలై నగర్ సమీపంలోని గోవిందాపురంలో నివాసం ఉంటున్నాడు.

బెంగళూరులో ఐటీ సోదాలు : మంచంకింద అట్టపెట్టెల నిండా కరెన్సీ కట్టలు.. ఎన్ని కోట్లంటే...

కాగా.. గత ఏడాది కాలంగా రాజ్ కుమార్ తాగుడుకు అలవాటు పడ్డాడు. దీంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం కూడా అతడు తన భార్యతో గొడవకు దిగాడు. ఈ సమయంలో సహనం కోల్పోయిన అతడు ఆగ్రహంతో తన భార్యకు నిప్పంటించాడు. అనంతరం కుమారుడిని తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు.

రైడ్ క్యాన్సిల్ చేసిందని, మహిళకు న్యూడ్ ఫోటోలతో క్యాబ్ డ్రైవర్ వేధింపులు..!

నందిని అరుపులు వినిపించడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆమెను రక్షించి కీల్పాక్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆమెకు అప్పటికే 90 శాతం కాలిన గాయాలు అయ్యాయి. దీంతో చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించి ఆమె మరణించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గురువారం సాయత్రం రాజ్ కుమార్ ను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios