ప్రకాశంలో దారుణం.. పెళ్లి చేయలేదని తండ్రిని హత్య చేసిన కొడుకు..

పెళ్లి చేయలేదనే కోపంతో ఓ కుమారుడు కన్న తండ్రినే కడతేర్చాడు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగింది. ఇది స్థానికంగా కలకలం రేకెత్తించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Atrocity in Prakasham.. Son killed father for not marrying..ISR

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి చేయలేదనే కోపంతో ఓ కుమారుడు తన తండ్రిని అత్యంత దారుణంగా హతమార్చాడు. తరువాత అతడూ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం  రేకెత్తించింది. ‘ఈనాడు’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మార్కాపురం మండలంలోని రాయవరం కనకదుర్గమ్మ కాలనీలో బాలభద్రాచారి జీవిస్తున్నారు. ఆయనకు  గురునారాయణ కుమారుడు ఉన్నారు.

బెంగళూరులో ఐటీ సోదాలు : మంచంకింద అట్టపెట్టెల నిండా కరెన్సీ కట్టలు.. ఎన్ని కోట్లంటే...

అయితే తనకు పెళ్లి చేయలేదనే కారణంతో తండ్రిపై అతడు ఆగ్రహం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ప్లాన్ ప్రకారం.. తండ్రిని గురునారాయణ శనివారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. తరువాత బాలభద్రాచారిని దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన  అనంతరం అతడూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడికి గాయాలు కావడంతో స్థానికులు గమనించారు.

Israel-Palestine conflict: ఐరాస‌, భారత్ జోక్యంతో ఘర్షణలను ఆపాలని అజ్మీర్ దర్గా చీఫ్ జైనుల్ అబేదిన్ పిలుపు

వెంటనే అతడిని ఒంగోలులోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందటంతో డీఎస్పీ వీరారాఘవరెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఘటన చేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios