Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరులో ఐటీ సోదాలు : మంచంకింద అట్టపెట్టెల నిండా కరెన్సీ కట్టలు.. ఎన్ని కోట్లంటే...

బెంగళూరు ఐటీ సోదాల్లో వెలుగు చూసిన రూ.42కోట్ల నగదు సంచలనంగా మారింది. ఖాళీగా ఉన్న ఓ ఫ్లాట్లో మంచం కింద ఉన్న అరల్లో అట్టపెట్టెల నిండా వీటిని దాచిపెట్టారు. 

IT raids, in Bangalore : Cardboard boxes full of currency bundles under the bed found - bsb
Author
First Published Oct 14, 2023, 7:26 AM IST

బెంగళూరు : శుక్రవారం నాడు కర్ణాటక రాజధాని బెంగళూరులో  పలుచోట్ల ఐటీ సోదాలు జరిగాయి. ఆదాయ పన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో బెంగళూరులోని ఆనంద నగర వార్డ్ మాజీ కార్పొరేటర్ అశ్వత్థమ్మ నివాసంలో బయటపడ్డ నగదు షాక్ కు గురిచేసింది. కావల్ బైరసంద్ర మాజీ కార్పొరేటర్ నివాసంలో రూ.42 కోట్లు జప్తు చేశారు. అశ్వత్థమ్మ ఇంట్లో ఈ నగదు దొరికింది. ఆమె  భర్త ఆర్. అంబికాపతి కర్ణాటక గుత్తేదారుల సంఘం ఉపాధ్యక్షుడు.  అశ్వత్తమ్మ అన్న అఖండ శ్రీనివాసమూర్తి పులకేశినగర మాజీ ఎమ్మెల్యే. 

అశ్వత్థమ్మ కుటుంబ ఈ రాజకీయ నేపథ్యంతోనే ఈ డబ్బును రాజకీయ అవసరాల కోసమే పోగేసి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో ఇటీవల జరుగుతున్న ఐటీ దాడుల్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు ఒకే చోట దొరకడం ఇదే మొదటిసారి. అంబికాపతి, అశ్వత్థమ్మ నివాసాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు వారికి ఆర్టీనగర ఆత్మానంద కాలనీలో కూడా ఒక ఫ్లాట్ ఉందని గుర్తించారు.

న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ లో కాల్పుల కలకలం..

ఆ ఇంటికి సంబంధించిన తాళం చేతులు డ్రైవర్ దగ్గర ఉన్నాయని వారు చెప్పారు. దీంతో వెంటనే ఐటి అధికారులు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇంటిలోనూ సోదాలు నిర్వహించారు.  ఐటీ సోదరుల్లో ఆ ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది.. ఖాళీగా ఉన్న ఆ ఫ్లాట్లో ఓ గదిలో మంచం కింద ఉన్న డ్రాలలో 23 అట్టపెట్టెలు, వాటి నిండా  కరెన్సీ కట్టలు కనిపించాయి. అన్నీ రూ.500  నోట్లే.

దీంతో అవాక్కైనా ఐటీ అధికారులు ఈ నగదు మీద విచారణ చేపట్టారు. నగదు జప్తు వివరాలను ఈడి అధికారులకు తెలిపారు. అంబికాపతి దంపతులకు దీనిమీద విచారణకు హాజరుకావాలని నోటీసులు అందించారు. అంబికా పతి, అశ్వత్థమ్మ దంపతుల  కుమార్తెకు ఆర్టీనగర వైట్ హౌస్ విభాగంలో ఇల్లు ఉందని తెలిసింది.  దీంతోపాటు మాన్యతా టెక్ పార్క్ దగ్గర కూడా ఒక ఇల్లు, సుల్తాన్ పాల్యలో ఉన్న వీరికి చెందిన రెండు ఇళ్లలో కూడా ఐటీ సోదాలు చేశారు.

బెంగళూరు పాలికే గుత్తేదారు హేమంత్ అంబికాపతికి అత్యంత సన్నిహితుడు. ఆయన నివాసంలో కూడా ఐటీ దాడులు నిర్వహించి కొన్నిపేపర్లను అధికారులు సీజ్ చేశారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.  దీనిమీద మాజీ సీఎం కుమారస్వామి  కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. గుత్తేదారులకు విడుదల చేసిన నిధుల్లో రూ.650 కోట్లకు సంబంధించిన కమిషన్లను ఆయన నివాసంలో దాచి ఉంచారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేయడం కోసం ఈ నగదును సేకరించినట్లుగా కుమారస్వామి మండిపడ్డారు. బిజెపి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు తమ దగ్గర నుంచి 40% కమిషన్లను వసూలు చేసిందని గత ఎన్నికలలో అంబికా పతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది.

Follow Us:
Download App:
  • android
  • ios