Asianet News TeluguAsianet News Telugu

స‌లామ్ డాక్ట‌ర్ సాబ్.. ఆప‌రేష‌న్ చేసేందుకు బెంగ‌ళూరు ట్రాఫిక్ లో 45 నిమిషాలు ప‌రిగెత్తిన వైద్యుడు..

పేషెంట్ కు ఆపరేషన్ చేసేందుకు ఓ డాక్టర్ కారు దిగి పరిగెత్తాడు. వరద నీరు వల్ల కారు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో ఇతర మార్గం లేక ఆయన ఇలాంటి చర్యకు పూనుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

A doctor who ran for 45 minutes in Bangalore traffic to perform an operation
Author
First Published Sep 12, 2022, 2:47 PM IST

వైద్యో నారాయ‌ణ హ‌రి అంటారు. అంటే వైద్యుడు దేవుడితో స‌మానం అని అర్థం. ఆ మాట‌ల‌కు స‌రైన ఉదాహ‌ర‌ణ‌గా నిలిచారు బెంగ‌ళూరుకు చెందిన ఓ డాక్ట‌ర్. త‌న క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తించ‌డానికి ఓ డాక్ట‌ర్ 45 నిమిషాల పాటు నిర్విరామంగా పరిగెత్తి హాస్పిట‌ల్ కు చేరుకున్నాడు. అనంత‌రం పేషెంట్ కు ఆప‌రేష‌న్ చేసి త‌న అంకిత భావాన్ని ప్ర‌ద‌ర్శించారు. 

తెర పైకి ఆర్ఎస్ఎస్ ఖాకీ నిక్క‌ర్ వివాదం.. అస‌లేం జ‌రిగిందంటే..?

బెంగ‌ళూరు సిటీ. వ‌ర్షాల వ‌ల్ల రోడ్డుపైన నిలిచిపోయిన వ‌ర‌ద నీరు. దీని వ‌ల్ల కిలో మీట‌ర్ పొడ‌వున ఆగిపోయిన వాహ‌నాలు. ఆ వాహ‌నాల్లో ఓ డాక్ట‌ర్ కారు కూడా ఉంది. కానీ ఆయ‌న‌కు ట్రాఫిక్ క్లియ‌ర్ అయ్యేంత వ‌ర‌కు ఎదురు చూసే టైం లేదు. అక్క‌డ ఓ పేషెంట్ కు ఆప‌రేష‌న్ చేయాల్సిన బాధ్య‌త ఈ డాక్ట‌ర్ చేతిలో ఉంది. దీంతో మ‌రేమీ ఆలోచించ‌కుండా వెంట‌నే కారు దిగాడు. కానీ ట్రాఫిక్ జామ్ వ‌ల్ల వేరే ఇత‌ర వాహనాలు కూడా హాస్పిట‌ల్ కు వెళ్లే ప‌రిస్థితి లేదు. దీంతో ఇక ఆలోచించ‌కుండా ప‌రిగెత్త‌డం ప్రారంభించాడు. ఏకదాటిగా 45 నిమిషాల పాటు ప‌రిగెత్తి హాస్పిట‌ల్ కు చేరుకున్నాడు. రోడ్డు వెంట ఆ డాక్ట‌ర్ ప‌రిగెత్తే సంద‌ర్భానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

తెలంగాణ‌లో లవ్ జిహాద్ వ్యతిరేక చట్టం తేవాలి.. ప్రభుత్వ వైఖరి మారకపోతే ఉద్యమం: వీహెచ్‌పీ నేత సురేంద్ర జైన్

ఈ విష‌యంలో ఎంతో మందిలో పాజిటివ్ ఎన‌ర్జీని నింపింది. ఆ సిటీలో ఎంతో మంది డాక్ట‌ర్ నిబ‌ద్ద‌త‌పైనే ముచ్చ‌టిస్తున్నారు. ప‌లు మీడియా సంస్థ‌లు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. బెంగుళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో గోవింద్ నంద‌కుమార్ డాక్ట‌ర్ గా ప‌ని చేస్తున్నారు. ఆయ‌న గ‌త 18 సంవత్సరాలుగా అనేక క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేశారు. మంచి వైద్యుడిగా కూడా పేరుంది. 

ఆగస్టు 30వ తేదీన డాక్ట‌ర్ నంద‌కుమార్ ఎప్ప‌టిలాగే హాస్పిట‌ల్ కు బ‌య‌లుదేరాడు. కానీ బెంగ‌ళూరులో కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా రోడ్లన్నీ జలమయమ‌య్యాయి. సర్జాపూర్-మరాతహళ్లి రహదారిపై ట్రాఫిక్ జామ్‌లో ఆయ‌న ఇరుక్కుపోయారు. అదే స‌మ‌యంలో ఆ డాక్ట‌ర్ త‌ను ప‌ని చేస్తున్న హాస్పిట‌ల్ లో రోగికి పిత్తాశయ శస్త్రచికిత్స చేయవలసి ఉంది. లేట్ అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. దీంతో వెంట‌నే డాక్ట‌ర్ కారు దిగి ప‌రిగెత్తుకుంటూ హాస్పిట‌ల్ కు చేరుకున్నారు. అలా పేషెంట్ల గురించి ఆలోచిస్తూ ఎట్టకేలకు నందకుమార్ కారు దిగి పరుగు ప్రారంభించాడు. కొన్ని నిమిషాల నిర్విరామ ప‌రుగు తరువాత హాస్పిట‌ల్ కు చేరుకున్నారు.

సోనియా గాంధీని క‌ల‌వ‌నున్న బీహార్ సీఎం నితీష్ కుమార్, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్

‘‘ నేను అత్యవసరంగా మణిపాల్ ఆస్పత్రికి చేరుకోవాల్సి ఉంది. కానీ భారీ వర్షం వ‌ల్ల నీరు నిలిచిపోవడంతో రోడ్డు కిలో మీట‌ర్ మేరు ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమయం వృథా చేయకూడదని.. పేషెంట్లు నా కోసం ఎదురు చూస్తున్నారని ఆలోచించాను. అందుకే పరుగెత్తాలని నిర్ణయించుకున్నాను ’’ అని ఆ డాక్టర్ తెలిపారు. ఆయ‌న రికార్డ్ చేసిన సెల్పీ వీడియోను ట్విట్ట‌ర్ లో షేర్ చేస్తూ.. కొన్ని సార్లు ప‌ని చేయ‌డానికి ప‌రిగెత్త‌డం మంచిది అని క్యాప్ష‌న్ పెట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios