Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ‌లో లవ్ జిహాద్ వ్యతిరేక చట్టం తేవాలి.. ప్రభుత్వ వైఖరి మారకపోతే ఉద్యమం: వీహెచ్‌పీ నేత సురేంద్ర జైన్

న్యాయవ్యవస్థ కూడా మతమార్పిడిని అత్యంత జుగుప్సాకరంగా పరిగణిస్తోందని వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్ర జైన్ అన్నారు. మహిళల పట్ల ఈ వికృత మనస్తత్వానికి వ్యతిరేకంగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయని తెలిపారు. 

Jihadis can not make Telangana their Hunting ground says VHP Surendra Jain
Author
First Published Sep 12, 2022, 2:23 PM IST

ప్రపంచవ్యాప్తంగా జిహాదీ దురాక్రమణ పెరుగుతోందని విశ్వ హిందూ పరిషత్ ఆరోపించింది. లవ్‌ జిహాద్‌ మానవాళి పీడిస్తోందని మండిపడింది.. ఇది మానవాళికి వ్యతిరేకంగా జరిగిన భారీ రహస్య, మోసపూరిత, దారుణమైన నేరమని రుజువు చేస్తోందని తెలిపింది. భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం ఆక్రమణదారుడితో ప్రారంభమైన జిహాద్ యొక్క ఈ అత్యంత దిగజారుడు రూపం ఇప్పటికీ కొనసాగుతోందని విమర్శించింది. ఇందులో ముస్లిమేతర బాలికలు, స్త్రీలను మాల్-ఎ-ఘనిమత్‌గా పరగణిస్తారని.. వారి నమ్రత, గౌరవం క్రూరమైన అమానవీయ పద్ధతిలో ఉల్లంఘించబడుతుందని ఆరోపించింది. ఇంతకు ముందు ఈ నరకయాతన బలవంతంగా మాత్రమే జరిగిందని.. ఇప్పుడు ముస్లిమేతర స్త్రీలు బలవంతంగా, మోసపూరిత వ్యూహాల ద్వారా మోసగించబడి ఉచ్చులో ఉన్నారని విమర్శించింది. జిహాదీల ఈ దుర్మార్గమైన నేరపూరిత చర్యను ఆపాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్లోని ప్రెస్‌క్లబ్‌లో వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్ర జైన్ విలేకరులతో మాట్లాడారు.

న్యాయవ్యవస్థ కూడా మతమార్పిడిని అత్యంత జుగుప్సాకరంగా పరిగణిస్తోందని అన్నారు. మహిళల పట్ల ఈ వికృత మనస్తత్వానికి వ్యతిరేకంగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయని తెలిపారు. ఈ పరిణామాలు మయన్మార్, శ్రీలంక, లడఖ్‌లలో కనిపించాయని అన్నారు. ‘‘శాంతిని ప్రేమించే బౌద్ధ సమాజం నుంచి ఇంత పదునైన స్పందన రాగలిగితే.. మిగిలిన మానవ సమాజం యొక్క ప్రతిచర్యను సులభంగా ఊహించుకోవచ్చు. దీనికి జిహాదీ మనస్తత్వం, వీటిని ప్రేరేపించే చిత్తశుద్ధి లేని ముస్లిం నాయకులు మాత్రమే బాధ్యత వహించాలి’’ అని పేర్కొన్నారు. 

లవ్ జిహాద్, చట్టవిరుద్ధమైన మత మార్పిడులకు వ్యతిరేకంగా అతి త్వరలో చట్టాన్ని తీసుకురావాలని.. జాతీయ ఐక్యత, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు తెచ్చే ఈ నేరం నుండి భారత్‌ను విముక్తి చేయాలని కోరారు. తెలంగాణలోని జిహాదీలు మహిళా వ్యతిరేక మనస్తత్వానికి ఇప్పటికే పేరు తెచ్చుకున్నారని అన్నారు. ‘‘నికాహ్ ముతా (ఆనంద వివాహం, తాత్కాలిక వివాహం) పేరుతో ఇది ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి ఆనందాన్ని కోరుకునే షేక్‌లకు ఇంద్రియ ఆనందాలకు కేంద్రంగా మారింది. హిందూ స్త్రీలు కూడా రజాకార్ల కాలం నుంచి ఈ నీచమైన మనస్తత్వానికి గురవుతున్నారు. ఆదిలాబాద్, భద్రాచలం, భూపాలపల్లి, ములుగు వంటి ప్రాంతాల గిరిజన సంఘాలు వీరి ప్రత్యేక లక్ష్యాలు. హిందూ పేర్లు, గుర్తుల ముసుగులో హిందువులుగా వేషాలు వేస్తూ.. ఈ జిహాదీలు అమాయక బాలికలను మాత్రమే కాకుండా వారి భూములను కూడా ట్రాప్ చేస్తున్నారు. ఈ తెగల మతం, స్త్రీలు, సంప్రదాయాలు, భూమి నేడు ప్రమాదంలో ఉన్నాయి’’ అని సురేంద్ర జైన్  అన్నారు. 

ఎంఐఎం ఆదేశానుసారం నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వం జిహాదీలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ‘‘హిందూ వ్యతిరేక జిహాదీ మనస్తత్వం కారణంగా.. ముస్లిం అబ్బాయిని లేదా అమ్మాయిని వివాహం చేసుకున్న హిందూ అమ్మాయి లేదా అబ్బాయి ఇస్లాం మతంలోకి మారకపోతే.. వారి జీవితాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో హిందూ యువకుడు బిల్లాపురం నాగరాజును అతని భార్య అష్రిన్ సుల్తానా బంధువులు దారుణంగా హత్య చేసిన కేసు పాతదేమి కాదు. చట్టవిరుద్ధంగా అడ్డగోలుగా మత మార్పిడులు జరిగే సంఘటనలు కూడా విపరీతంగా పెరిగాయి పెరిగాయి. దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లవ్ జిహాద్, అక్రమ మతమార్పిడులను అరికట్టేందుకు చట్టాలను రూపొందించాయి. తెలంగాణ సంస్కృతి, సమాజం పట్ల వారి బాధ్యతను కూడా గ్రహించి.. త్వరలో మతమార్పిడి, లవ్-జిహాద్ వ్యతిరేక చట్టాలను రూపొందించాలని వీహెచ్‌పీ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. 

దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వ హిందూ వ్యతిరేక మనస్తత్వం తెరపైకి వచ్చిందని సురేంద్ర జైన్ ఆరోపించారు. హిందువుల పండుగలపై రకరకాల ఆంక్షలు విధిస్తారని.. కానీ హిందూయేతర పండుగలకు మాత్రం అన్ని రకాల మినహాయింపులు ఇస్తారని విమర్శించారు. గణేష్ నిమజ్జనం, బోనాల పండుగపై విధించిన ఆదిల్షాహి ఆంక్షలు హిందూ సమాజం బలమైన పోరాటం తర్వాత మాత్రమే తొలగించబడ్డాయని అన్నారు. ఒక హిందువు ఏదైనా పండగ చేసుకోవడానికి వెళితే.. జిజ్యా పన్ను వసూలు చేస్తున్నట్లుగా ఆర్టీసీ బస్సులో స్పెషల్ చార్జ్‌ల పేరుతో అనేక రేట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు హిందూయేతరుల పండుగల్లో ఉచితంగా రేషన్, గుడ్డ, ఇతర రకాల సబ్సిడీలు ఇస్తూ ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. 

అనేక ప్రవేశ పరీక్షలలో హిందూ మహిళల మంగళసూత్రం, ఇతర శుభ చిహ్నాలు తీసివేయబడతాయని.. అయితే ముస్లిం మహిళల హిజాబ్ కూడా పరీక్షల సమయంలో అనుమతించబడుతుందన్నారు.  ‘‘పెరుగుతున్న ఈ ముస్లిం బుజ్జగింపు ఫలితం ఏమిటంటే.. ఒక ట్రాఫిక్ పోలీసు తన డ్రైవింగ్ లైసెన్స్ చూపించమని ముస్లిం యువకుడిని అడిగినప్పుడు.. ఆ అధాకారి ముస్లిం యువకులచే కొట్టబడతాడు. అంతేకాకుండా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుంది’’ అని అన్నారు. 

కొంతమంది చిత్తశుద్ధి లేని ముస్లిం నాయకుల కోరికతో పెంచబడుతున్న ఈ హిందూ వ్యతిరేక మనస్తత్వాన్ని విడిచిపెట్టి.. ప్రజలందరికీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని నడపాలని వీహెచ్‌పీ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందని సురేంద్ర జైన్ అన్నారు. ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల పట్ల న్యాయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. హిందువులను అణచివేయడం, ముస్లింలను బుజ్జగించడం – ఈ రెండు విధానాలు రాష్ట్ర ప్రయోజనాలకు గానీ, ప్రభుత్వానికి గానీ ప్రయోజనం కలిగించవని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ఆలోచనా ధోరణిని మార్చుకోకుంటే.. ఇందుకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్  బలమైన ఉద్యమాన్ని చేపట్టాల్సి రావచ్చని హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios