చెరువులో స్నానం చేస్తున్న దళిత మహిళలను ఆ గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ కులం పేరుతో దూషించాడు. బట్టలను ముళ్లపొదల్లో పారేశాడు. ఈ ఘటనపై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
తమిళనాడులో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఓ చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన దళిత మహిళకు అవమానం జరిగింది. డీఎంకే పార్టీ సభ్యుడు, ఆ గ్రామ వైస్ ప్రెసిడెంట్ అక్కడికి చేరుకొని వారిని కులం పేరుతో దూషించాడు. అలాగే వారి బట్టలను సమీపంలోని ముళ్లపొదల్లో పారేశారు. దీంతో వారు సగం బట్టలతోనే బయటకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఏమిటీ దాని నేపథ్యం ?
వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో కుతంకుడి గ్రామానికి చెందిన షెడ్యూల్డ్ కులాల మహిళల బృందం జనవరి 1న గ్రామంలోని పబ్లిక్ చెరువులో స్నానం చేయడానికి వెళ్లారు. అయితే ఆ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్, డీఎంకే సభ్యుడు అయ్యప్పన్ అనే వ్యక్తి వారిని ఆపాడు. చెరువులో ఎందుకు స్నానం చేశారని వారిని కులం పేరుతో దూషించారు. స్నానం ఎందుకు చేయకూడదని మహిళలు ప్రశ్నించగా.. చేపల పెంపకం కోసం చెరువును ఇప్పటికే వేలం వేశామని అయ్యప్పన్ చెప్పినట్లు సమాచారం.
వివాదాస్పదంగా మారిన సీఎం వ్యాఖ్యలు.. నితీష్ కుమార్ ను టార్గెట్ చేసిన బీజేపీ
అయ్యప్పన్ అనేక కులాలను దూషించాడని, సగం దుస్తులు ధరించినప్పటికీ తమను తరిమికొట్టాడని మహిళలు ఆరోపించారు. సమీపంలోని ముళ్ల పొదల్లో తమ దుస్తులను కూడా విసిరేశారని చెప్పారు. అయ్యప్పన్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో ముత్తురామన్ అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడని పేర్కొన్నారు.
చరిత్రను తిరగరాసే సమయం ఆసన్నమైంది: హిమంత బిస్వా శర్మ
కాగా.. తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో గత పదిహేను రోజుల్లో ఇది రెండో కులపరమైన హింస. డిసెంబర్ 26న వెంగైవాయల్‌లోని షెడ్యూల్డ్ క్లాస్ కమ్యూనిటీ నివాసితులు మానవ మలాన్ని తాగునీటలో కలిపి ఉండటాన్ని గమనించి ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఓవర్‌హెడ్ ట్యాంక్ నుండి నీటిని సేకరించారు. ఈ కేసులో నిందితులను పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదు.
