Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఏమిటీ దాని నేపథ్యం ?

తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్న టీఆర్ఎఫ్ ను కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ సంస్థ పలు ఉగ్రవాద సంస్థలతో కలిసి పని చేస్తోందని తెలిపింది. ఈ సంస్థ జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా పని చేసింది. 

The central government has declared TRF as a terrorist organization.. What is its background?
Author
First Published Jan 9, 2023, 7:35 AM IST

జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ అనే సంస్థను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద ఉగ్రవాద సంస్థగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తీవ్రవాద సంస్థల అణిచివేతలో భాగంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)ని ఉగ్రవాద సంస్థగా గుర్తించి, 5 సంవత్సరాల పాటు దాని కార్యకలాపాలను కేంద్రం నిషేధించిన కొద్ది నెలల తర్వాత ఇది చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో క్రియాశీలకంగా ఉన్న తీవ్రవాద సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్).. కాశ్మీర్‌లో తీవ్రవాదం పెరిగేందుకు కీలక పాత్ర పోషించిన పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన శాఖగా ఏర్పడింది. 

‘‘టీఆర్ఎఫ్ కార్యకలాపాలు భారతదేశ జాతీయ భద్రత, సార్వభౌమత్వానికి హానికరం’’ అంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం -1967లోని నాలుగో షెడ్యూల్ ప్రకారం టీఆర్ఎఫ్ కమాండర్ షేక్ సజ్జాద్ గుల్ ను ఉగ్రవాదిగా ప్రకటించింది.

రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే ఏమిటి ?
ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థగా 2019 లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్) ఉనికిలోకి వచ్చిందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాద కార్యకలాపాలను విస్తృతం చేయడానికి ఇది ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ నుంచి యువతను సోషల్ మీడియా ద్వారా నియమించుకుంది. ఉగ్రవాద కార్యకలాపాల ప్రచారం, నియామకం, చొరబాట్లు, పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్ లోకి ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో టీఆర్ఎఫ్ ప్రమేయం ఉందని నోటిఫికేషన్ పేర్కొంది.

కరాచీకి వెలుపల ఉన్న కాశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో పట్టు సంపాదించిన సుమారు ఆరు నెలల తరువాత, ఈ సంస్థ లష్కరేతో పాటు తెహ్రీక్-ఇ-మిల్లత్ ఇస్లామియా, ఘజ్నవి హింద్ వంటి వివిధ సంస్థల కలయికగా రూపుదిద్దుకుంది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ లోని కరాచీకి చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ కాశ్మీర్ లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ సంస్థ 2020లో మాత్రమే దాడులకు బాధ్యత వహించడం ప్రారంభించింది. లోయలో వేర్వేరు దాడులు జరిగిన తరువాత ఈ సంస్థ వెనుక నిఘా, మద్దతు అర్థమైంది. అయితే లష్కరే తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంప్రదాయ ఉగ్రవాద సంస్థల కంటే ఈ సంస్థే అనేక దాడులకు బాధ్యత వహించింది. ఇది టీఆర్ఎఫ్ ఈ తీవ్రవాద సంస్థలతో కలిసి పనిచేస్తోందని సూచించింది.

కశ్మీర్ లోని సోపోర్లో చాలాకాలంగా బలమైన లష్కర్ కంచుకోటగా ఉన్న ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (ఓజీడబ్ల్యూ) మాడ్యూల్ ను పోలీసులు ఛేదించినప్పుడు టీఆర్ఎఫ్ పెరుగుతున్న మిలిటెంట్ గ్రూప్ గా ఆవిర్భవించిందని మొదటి సారిగా సంకేతాలు కనిపించాయి. కేరన్ వద్ద నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో ఉగ్రవాదులు విసిరిన చాలా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన ఓవర్ గ్రౌండ్ వర్కర్లు కొత్త సంస్థ కోసం యువతను రిక్రూట్ చేసుకుంటున్నారని వెల్లడించారు. 2022 సంవత్సరానికి గాను జమ్మూ కాశ్మీర్ పోలీసులు విడుదల చేసిన తన వార్షిక నివేదికలో.. గతేడాది లోయలో మరణించిన ఉగ్రవాదులలో అత్యధికులు టీఆర్ఎఫ్, ఎల్ఇటీ కి చెందిన వారే ఉన్నారని తేల్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios