బీహార్ సీఎం నితీష్ కుమార్ జనాభా నియంత్రణ, మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యలను ప్రతిపక్ష బీజేపీ తప్పుపట్టింది. మహిళలు చదువుకోకపోవడం, పురుషులు అజాగ్రత్తగా ఉండటం వల్ల రాష్ట్రంలో జనాభా నియంత్రణలోకి రావడం లేదని వ్యాఖ్యలు చేశారు.

బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ జనాభా నియంత్రణపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పురుషులు జాగ్రత్తగా ఉండటం వల్ల, అలాగే.. మహిళలు విద్యావంతులైతే జనాభా నియంత్రణ దానంతట అదే జరుగుతుందని ఆయన అన్నారు. వైశాలిలో జరిగిన ఓ బహిరంగ సభలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలు చదువుకుంటే సంతానోత్పత్తి రేటు పడిపోతుందని.. ఇదీ వాస్తవం.. ఈ రోజుల్లో మహిళలు చదువుకోవడం లేదు..మహిళలు భాగా చదువుకుని ఉంటే వారికి గర్భం నుంచి ఎలా రక్షించుకోవాలో అవగాహన ఉంటుందని అన్నారు. మగవారు అజాగ్రత్తగా ఉండటం, మహిళలు చదువుకోకపోవడం వల్ల జనాభా పెరుగుతోందని, పురుషులు ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఆలోచించడం లేదని అన్నారు. నితీష్‌ కుమార్‌ ఈ ప్రకటనతో బీహార్‌ రాజకీయాలు వేడెక్కాయి.

నితీష్‌ కుమార్‌ చేసిన ఈ ప్రకటనను ప్రతిపక్ష బీజేపీ సమస్యగా మార్చింది. ఆయన అసభ్య పదజాలంతో, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా ఆయన చేసిన వ్యాఖ్యను బీజేపీ తప్పుబట్టింది. బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత సామ్రాట్ చౌదరి కూడా నితీష్ కుమార్‌పై విరుచుకుపడ్డారు. నితీష్ ప్రకటన అసభ్యకరంగా ఉందని ట్వీట్ చేశారు. ‘‘ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ప్రకటనలో అసభ్యకరమైన పదాలు ఉపయోగించారు. అలాంటి పదాలను ఉపయోగించడం వల్ల.. ముఖ్యమంత్రి పదవి గౌరవం తగ్గుతుంది’’ అని ఆయన ట్విట్టర్‌లో చేశారు. అలాగే.. నితీష్ కుమార్ పై బీజేపీ అధికార ప్రతినిధి అరవింద్ సింగ్ మండిపడ్డారు. నితీష్ కుమార్ చేసిన ప్రకటన పూర్తిగా అసభ్యకరమని అన్నారు. వయస్సు డిమాండ్లు మరియు ఈ తరహా ప్రకటనలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సరిపోవని అన్నారు. 

మరోవైపు నితిష్ కుమార్ ప్రకటనపై బీజేపీ నేత అమిత్ మాల్వియా స్పందిస్తూ.. "విద్యావంతులైన మహిళలు ఎక్కువ అవగాహన కలిగి ఉంటారు. కుటుంబ నియంత్రణ విషయాలలో ఎక్కువ మాట్లాడుతారనేది నిజం. కానీ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ దానిని మరింత మెరుగ్గా రూపొందించి ఉండొచ్చని అన్నారు. అన్ని వర్గాల మహిళలకు వివాహ వయస్సును 21 సంవత్సరాలకు పెంచడానికి JD(U) ప్రతిపాదిత మద్దతునిస్తుందని కూడా దీని అర్థం.

Scroll to load tweet…

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నితీష్ ఆనంద్ అన్నారు. సీఎం వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవిగా ఉన్నాయని. మహిళలు చదువుకోవాలి మంచిదే.. కానీ మగవారి పరువు ఎందుకు తీయాలి..? అని నిలదీశారు. అదే సమయంలో నితీష్ కుమార్ ఈ ప్రకటనకు ఆర్జేడీ మరో అర్థం చెప్పింది. నితీష్ కుమార్ చేసిన ప్రకటనలు ఏ తప్పుడు సందర్భంలో చేసినవి కాదన్నారు. మహిళలు విద్యావంతులైతే జనాభా నియంత్రణ దానంతట అదే జరుగుతుందని ఆయన ప్రకటనలో అర్థం. పురుషులు ఏ విధంగానూ జనాభా నియంత్రణ గురించి రిమోట్‌గా కూడా పట్టించుకోరని తెలిపింది.