Asianet News TeluguAsianet News Telugu

వార్నీ.. జ్వరమొచ్చిందని హాస్పిటల్ కు తీసుకెళ్తే అంబులెన్స్ ను ఎత్తుకెళ్లిన 13 ఏళ్ల బాలుడు..

13 ఏళ్ల బాలుడు ఓ తుంటరి పని చేశాడు. జ్వరంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో బయట ఉన్న ఓ అంబులెన్స్ ను ఎత్తుకెళ్లాడు. తరువాత దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

A 13-year-old boy who took the ambulance to the hospital because of fever..
Author
First Published Dec 13, 2022, 1:32 PM IST

ఆ బాలుడికి 13 సంవత్సరాలు. పదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల బాగా జ్వరం వచ్చింది. దీంతో తండ్రి హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. ఆ బాలుడి తండ్రి కూడా అదే హాస్పిటల్ లో పని చేస్తున్నాడు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో ఆ బాలుడు హాస్పిటల్ సమీపంలో నిలిపి ఉన్న అంబులెన్స్ ను ఎత్తుకెళ్లాడు. ఈ విచిత్ర ఘటన కేరళలో చోటు చేసుకుంది.

భారత్ - చైనాల మధ్య టెన్షన్..టెన్షన్.. అరుణాచ‌ల్ వ‌ద్ద ఫైట‌ర్ జెట్స్ పెట్రోలింగ్‌

వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని త్రిసూల్ హాస్పిటల్ లో 13 ఏళ్ల బాలుడు ఇటీవల హాస్పిటల్ లో చేరాడు. పదో తరగతి చదువుతున్న ఆ బాలుడు దాదాపు వారం రోజులుగా జ్వరం, రక్త హీనతతో బాధపడుతున్నాడు. అయితే ఆ బాలుడిని తండ్రి తను పని చేస్తున్న హాస్పిటల్ కు తీసుకొచ్చాడు. అక్కడ డాక్టర్లు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. 

పోర్నోగ్రఫీ కేసు.. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు ముందస్తు బెయిల్ మంజూరు

ఈ క్రమంలో ఓ అంబులెన్స్ హాస్పిటల్ ప్రాంగణానికి వచ్చింది. దాని డ్రైవర్ కీని వాహనానికే ఉంచి, నీళ్ల కోసం బయటకు వచ్చాడు. దీనిని గమనించి బాలుడు అంబులెన్స్ ఎక్కాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. వాహహాన్ని స్టార్ట్ చేసి దానిని ఎత్తుకెళ్లాడు. దాదాపు 8 కిలో మీటర్లు తీసుకెళ్లాడు. 

కర్ణాటకలో జికా వైరస్ కలకలం.. తొలిసారిగా ఐదేళ్ల బాలికకు సోకిన వ్యాధి

అయితే అప్పటికే తన వాహనం చోరీకి గురయ్యిందని డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాహనం మైనర్ బాలుడు నడుపుతుండటం చూసిన పలువురు స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారని ‘టైమ్స్ నౌ’ కథనం నివేదించింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని అంబులెన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios