Asianet News TeluguAsianet News Telugu

భారత్ - చైనాల మధ్య టెన్షన్..టెన్షన్.. అరుణాచ‌ల్ వ‌ద్ద ఫైట‌ర్ జెట్స్ పెట్రోలింగ్‌

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో వాస్తవ అధీన రేఖ వ‌ద్ద యుద్ధ విమానాల‌తో భార‌త్ పెట్రోలింగ్ నిర్వ‌హిస్తోంది. చైనా ఉల్లంఘ‌న‌ల‌ను అడ్డుకునేందుకు గ‌త కొన్ని రోజుల నుంచి భార‌త వైమానిక ద‌ళాలు పెట్రోలింగ్ చేప‌డుతున్న‌ట్లు అధికార వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. అరుణాచ‌ల్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వ‌ద్ద జోరుగా పెట్రోలింగ్ జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు.

India Starts Combat Air Patrols Over Arunachal Amid China Tension
Author
First Published Dec 13, 2022, 12:55 PM IST

భారత వైమానిక దళం: ఇటీవల భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన వాగ్వాదంతో మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆ బోర్డ‌ర్ వ‌ద్ద యుద్ధ విమానాల‌తో భార‌త్ పెట్రోలింగ్ నిర్వ‌హిస్తోంది. గ‌త కొన్ని రోజుల నుంచి చైనా ఉల్లంఘ‌న‌ల‌ను అడ్డుకునేందుకు భార‌త వైమానిక ద‌ళాలు పెట్రోలింగ్ చేప‌డుతున్న‌ట్లు అధికార వ‌ర్గాల సమాచారం.

అరుణాచ‌ల్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వ‌ద్ద పెద్ద ఎత్తున పెట్రోలింగ్ జ‌రుగుతున్న‌ట్లు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా గగనతల ఉల్లంఘనలను నిరోధించేందుకు తెలుస్తోంది. ఇటీవల రెండు-మూడు సార్లు ఫైటర్ జెట్‌లను గస్తీ కాస్తున్నట్టు తెలుస్తోంది. భారత, చైనా దళాల తిరోగమనానికి ముందు గత వారం అరుణాచల్ ప్రదేశ్‌లో LAC పై ఘర్షణ జరిగినట్లు సమాచారం. అదే సమయంలో భారత వైమానిక దళం (IFA) డిసెంబర్ 16 నుండి 25 వరకు అరుణాచల్ ప్రదేశ్‌తో సహా ఈశాన్య రాష్ట్రాల్లో సుఖోయ్ -30తో సహా ఇతర యుద్ధ విమానాలతో విన్యాసాలు చేయనున్నది.  

భారత-చైనా మధ్య ఘర్షణ 

అరుణాచ‌ల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో డిసెంబ‌ర్ 9వ తేదీన చైనా, భార‌త సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగిన విష‌యం తెలిసిందే. పలు మీడియా కథనాల ప్రకారం.. చైనా దళాలు LACని దాటాయి. ఆ తర్వాత భారత దళాలు  వారితో బలంగా పోరాడాయి. దీంతో  చైనా దళాలు వెనక్కి తగ్గాయి. ఈ దాడిలో ఇరువర్గాలకు చెందిన సైనికులకు స్వల్ప గాయాలయ్యాయని, ఇరువర్గాలు వెంటనే వెనుదిరిగారని వర్గాలు తెలిపాయి. తూర్పు లడఖ్‌లో జరిగిన ఘర్షణల తర్వాత చాలా కాలం తర్వాత భారత్, చైనా సైనికుల మధ్య ఇలాంటి వాగ్వివాదం జరగడం ఇదే తొలిసారి.ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇవాళ పార్ల‌మెంట్‌లో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.

గాల్వన్ వ్యాలీలో ఘర్షణ 

 2020 జూన్ లో గాల్వాన్ వ్యాలీలో చైనా, భారత్ సైనికుల మధ్య అత్యంత దారుణ ఘర్షణ జరిగింది. ఆ సమయంలో భారత సైన్యంలోని 20 మంది సైనికులు అమరులయ్యారు. 40 మందికి పైగా చైనా సైనికులు మరణించారు. పలువురు గాయపడ్డారు.సైనిక కమాండర్ల మధ్య అనేక సమావేశాల తరువాత.. లడఖ్‌లోని గోగ్రా-హాట్ స్ప్రింగ్స్‌తో సహా కీలకమైన పాయింట్ల నుండి భారత, చైనా దళాలను ఉపసంహరించుకున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios