Asianet News TeluguAsianet News Telugu

Omicron variant: క‌ల‌వ‌ర‌పెడుతున్న ఒమిక్రాన్‌.. కొత్త‌గా మ‌రో 8 కేసులు.. మొత్తం 153

Omicron variant: చాలా దేశాల్లో ఒమిక్రాన్ పంజా విసురుతోంది. భార‌త్ లోనూ ఈ రకం కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్త‌గా మరో 8 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, సాధార‌ణ క‌రోనా కేసులు కూడా క్ర‌మంగా పెరుగుతుండటం  ఆందోళన కలిగిస్తోంది. 
 

8 fresh cases of Covid s Omicron variant, national tally rises to 153
Author
Hyderabad, First Published Dec 20, 2021, 11:52 AM IST

Omicron variant: ద‌క్షిణాఫ్రికాలో గ‌త నెల‌లో వెలుగుచూసిన క‌రోనా మ‌హ‌మ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. చాలా దేశాల్లో దీని ఉధృతి మొద‌లైంది. మ‌రీ ముఖ్యంగా ద‌క్షిణాఫ్రికా, అమెరికాల‌తో పాటు బ్రిట‌న్‌, ఫ్రాన్స్ వంటి దేశాల్లో క‌రోనా పంజా విసురుతోంది. భార‌త్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్ర‌మంగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  తాజాగా మరో 8 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్  కేసుల సంఖ్య 153కి పెరిగింది. ఆదివారం మహారాష్ట్రలో ఆరు, గుజరాత్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్​ కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 22, రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 14, తెలంగాణ 20, గుజరాత్‌ 11, కేరళ 11, ఆంధ్రప్రదేశ్‌, ఛండీగఢ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.  అధిక సంఖ్య‌లో శాంపిళ్లు ఇంకా జీనోమ్ సిక్వెన్సీంగ్ కోసం వేయిటింగ్ లిస్టులో ఉన్న‌ట్టు స‌మాచారం. ఒమిక్రాన్ కేసులు నిత్యం వెలుగుచూస్తుండ‌టంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నాయి. విదేశాల నుంచి వ‌చ్చిన వారిని త‌ప్ప‌ని స‌రిగా క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన త‌ర్వాత‌నే వ‌దిలిపెడుతున్నారు. ఇప్ప‌టిర‌కు దేశంలో క‌రోనా ఒమిక్రాన్ కేసులు విదేశాల నుంచి వ‌చ్చిన‌వారి నుంచి న‌మోద‌య్యాయ‌ని అధికారులు తెలిపారు. 

Also Read: Omicron :బ్రిట‌న్ లో ఒమిక్రాన్ పంజా.. ఒకే రోజు 90 వేల‌కు పైగా కొత్త కేసులు

డెల్టా వేరియంట్ కంటే ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త క‌రోనా వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత వేగంగా  వ్యాపిస్తున్న‌ద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ప్ర‌పంచ దేశాల‌న్ని మెరుగైన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని తెలిపింది. క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు  డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉన్న‌ప్ప‌టికీ.. రోగుల‌పై ఏ స్థాయిలో ప్ర‌భావం చూపుతుంద‌నేదానిపై ఇప్ప‌టివ‌ర‌కు స్ప‌ష్ట‌మైన స‌మాచారం లేద‌ని తెలిపింది. దీనిపై ఓ నిర్ణ‌యానికి రావ‌డానికి మ‌రింత డేటా కావాల‌ని పేర్కొంది. అలాగే, ఒమిక్రాన్ వేరియంట్ ఇప్ప‌టికే ప్ర‌పంచంలోని 90కిపైగా దేశాల‌కు వ్యాపించింద‌ని తెలిపింది. మ‌రిన్ని దేశాల్లోనూ ఈ కేసుల‌ను గుర్తించ‌డానికి డ‌బ్ల్యూహెచ్‌వో బృంధాల‌ను పంపిన‌ట్టు పేర్కొంది. దీనిపై ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపింది. 

Also Read: Telangana: ఢిల్లీలో తెలంగాణ క్యాబినేట్ మ‌కాం.. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం.. !

ఇదిలావుండ‌గా, భార‌త్ లో ఒమిక్రాన్ కేసుల‌తో పాటు సాధార‌ణ క‌రోనా వైర‌స్ కేసులు సైతం పెరుగుతున్నాయి. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం ఆందోళ‌న వ్య‌క్త చేస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్‌-19 వ్యాప్తికి మెరుగైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది. సోమ‌వారం ఉదయం కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24  గంటల్లో దేశంలో 6,563 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసులు 3,47,46,838 కి చేరాయి.  కొత్త‌గా వైర‌స్ నుంచి  8,077 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 82,267 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో మొత్తం కోలుకున్న‌వారి సంఖ్య 34187017కు పెరిగింది. అలాగే, గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ.. 132 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,77,554కి పెరిగింది. క‌రోనా కేసులు, మ‌ర‌ణాల అధికంగా న‌మోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ లు టాప్-10 లో ఉన్నాయి. దేశంలో సాధార‌ణ కేసుల‌తో పాటు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌టంతో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో వేగం పెంచారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 137.7 కోట్ల మొద‌టి డోసు వ్యాక్సిన్ల‌ను పంపిణీ చేయ‌గా, అందులో  55 కోట్ల మంది రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్నారు. 

Also Read: Omicron: గుజరాత్ లో మ‌రో రెండు ఒమిక్రాన్ కేసులు.. మొత్తం ఎన్నంటే?

Follow Us:
Download App:
  • android
  • ios