Telangana: ఢిల్లీలో తెలంగాణ క్యాబినేట్ మకాం.. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం.. !
Telangana: గత కొన్ని రోజులుగా కేంద్రంలోని ప్రధాని మోడీ సర్కారు వర్సెస్ తెలంగాణలోని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అనే విధంగా రాజకీయాలు నడుస్తున్నాయి. వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ వార్ మరింత ముదిరింది. ఇదే విషయంపై ఇరువురి వాదనలతో రాజకీయంగా హీటు పెరిగడంతో పాటు కాస్త గందరగోళ పరిస్థితి కూడా ఏర్పడింది. వరిధాన్యం కొనుగోలు విషయంలో తాడోపేడో తెల్చుకోవడానికి సోమవారం కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తో తెలంగాణ మంత్రులు భేటీ కానున్నారు.
Telangana : దేశంలో గత కొంత కాలంగా అన్నదాతల అంశాల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చినప్పటి నుంచి రైతులు, ప్రతిపక్షాలు సాగు చట్టాలకు వ్యతిరేకంగా నినదించారు. రైతులు అయితే, ఏకంగా ఏడాదికి పైగా ఉద్యమించి.. దేశవ్యాప్తంగా నిరసనలను మరింత ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే రైతులు డిమాండ్లకు కేంద్రం వెనక్కి తగ్గని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వరిధాన్యం కొనుగోలు విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలో ఉన్న ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు వర్సెస్ తెలంగాణలోని ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ అనే విధంగా మారింది. ప్రస్తుతం కేంద్రం వర్సెస్ టీఆర్‌ఎస్ వార్ నడుస్తోంది. ఇందులో భాగంగా సోమవారం నాడు దేశరాజధాని ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను తెలంగాణ మంత్రులు, ఎంపీలు కలవనున్నారు. తెలంగాణ మంత్రులు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన హామీకి ఇవ్వాలని కోరనున్నారు.
Also Read: Omicron: గుజరాత్ లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు.. మొత్తం ఎన్నంటే?
గత కొంత కాలంగా తెలంగాణలో రాజకీయ రగడ సృష్టించిన వరిధాన్యం కొనుగోలు అంశం ప్రస్తుతం ఢిల్లీకి చేరుకుంది. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేశారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన హామీ వచ్చే వరకు పోరుసాగిస్తామని తెలంగాణ అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయమై కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు.. హస్తినకు వెళ్లారు తెలంగాణ మంత్రులు. ప్రధానితో సహా పలువురు కేంద్రమంత్రుల అప్పాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సగం తెలంగాణ మంత్రివర్గం ఢిల్లీకి చేరుకోగా.. మరికొందరు మినిస్టర్లు కూడా అక్కడికి వెళ్లనున్నారని సమాచారం. దేశరాజధానిలో మకాం వేసిన తెలంగాణ కేబినెట్… వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి స్పష్టత కోరుతోంది. ఎలాగైన అనుకూలా ప్రకటనను రాబట్టాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదిలావుండగా, వరిధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ప్రకటనలు చేసంది. రబీ సీజన్‌లో బాయిల్డ్ రైస్ కొనేది లేదనీ.. పార్లమెంట్ లోపలా, వెలుపలా… ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ ఎస్ కేంద్రంపై పోరుకు సిద్ధమైంది. పియూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రుల భేటీ ఏం తేల్చనుందనే విషయమై ఆసక్తి నెలకొంది.
Also Read: up assembly elections 2022: వాగ్దానాలివ్వడమే కాదు.. బ్రేక్ చేయడంలోనూ మోడీ దిట్ట: టీఎంసీ సెటైర్లు
కేంద్ర క్యాబినేట్ మంత్రులతో తెలంగాణ మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? ధాన్యం కొనుగోలు విషయంలో మోడీ సర్కారు తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా? కేంద్రమంత్రి సానుకూలంగా స్పందిస్తారా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దేశరాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ దూకుడు ఇలా ఉండగా, క్షేత్రస్థాయిలో కేంద్రంపై పోరుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు నిర్వహించే విధంగా టీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. కేంద్రం తీరును నిరసిస్తూ.. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఊరేగింపులు, నిరసన ర్యాలీలు, శవడప్పు కార్యక్రమాలు, ఆందోళనలు నిర్వహించనుంది. కేంద్రాన్ని వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నిరసన ప్రదర్శనల్లో రాష్ట్ర మంత్రులతో పాటు ప్రధాన నేతలందరూ పాల్గొననున్నారు. గజ్వేజ్ లో జరిగి నిరసన ధర్నాలో మంత్రి హరీష్‌రావు పాల్గొననున్నారని సమాచారం. టీఆర్ఎస్ ధర్నాలకు వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ సైతం ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతోంది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాల్లో మరింత హీట్ పెరగనుందని తెలుస్తోంది. చూడాలి మరి మున్ముందు కేంద్ర, టీఆర్ఎస్ వార్ ఏ స్థాయి వెళ్తుందో..!
Also Read: UP +Yogi..upyogi కాదు.. యూస్ లెస్: బీజేపీపై నిప్పులు చేరిన అఖిలేష్ యాదవ్