ఎమర్జెన్సీ రోజులను ప్రధాని నరేంద్ర మోడీ మరచి పోలేని కాలం అంటూ అభివర్ణించారు. ఆ 21 నెలల కాలాన్ని బ్లాక్ డే ఆఫ్ ఎమర్జెన్సీ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈజిప్టు పర్యటనలో ఉన్న ప్రధాని.. ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు.  

1975లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జెన్సీకి 48 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో బీజేపీ నేతలు జూన్ 25వ తేదీని ‘బ్లాక్ డే’గా పాటిస్తున్నారు. 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21న వరకు ఎమర్జెన్సీ అమల్లో ఉంది. ప్రస్తుతం ఈజిప్టులో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ రోజులను చీకటి రోజులుగా అభివర్ణించారు. ఎమర్జెన్సీ ఎదిరించిన వారికి ట్విటర్ వేదికగా నివాళులు అర్పించారు.

దారుణం.. పెళ్లికి వెళ్లి వస్తున్న కుటుంబంపై రాళ్లు రువ్విన అల్లరి మూకలు..రెండేళ్ల చిన్నారి మృతి

ఆ 21 నెలల కాలాన్ని 'బ్లాక్ డేస్ ఆఫ్ ఎమర్జెన్సీ'గా, 'మరచిపోలేని కాలం'గా ప్రధాని మోదీ అభివర్ణించారు. ‘‘ ఎమర్జెన్సీని ఎదిరించి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు కృషి చేసిన ధైర్యవంతులకు నివాళులు అర్పిస్తున్నాను. బ్లాక్ డే ఆఫ్ ఎమర్జెన్సీ మన చరిత్రలో మరచిపోలేని కాలంగా మిగిలిపోతాయి. ఇది మన రాజ్యాంగం జరుపుకునే విలువలకు పూర్తి విరుద్ధం’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

పోయిన ఆదివారం ప్రసారమైన తన నెలవారీ రేడియా కార్యక్రమం మాన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ఎమర్జెన్సీ రోజులను ప్రధాని ప్రస్తావించారు. ‘‘జూన్ 25ను మనం మరచిపోలేం. ఎమర్జెన్సీ విధించిన రోజు. భారత దేశ చరిత్రలో ఇదొక చీకటి కాలం. లక్షలాది మంది ఎమర్జెన్సీని సర్వశక్తులు ఒడ్డి వ్యతిరేకించారు. ఆ సమయంలో ప్రజాస్వామ్య మద్దతుదారులు ఎంతగా హింసించబడ్డారంటే నేటికీ మనసు వణికిపోతోంది. ఈ రోజు మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నప్పుడు ఇలాంటి నేరాలను కూడా గమనించాలి. ఇది యువ తరాలకు ప్రజాస్వామ్యం అర్థం. ప్రాముఖ్యతను నేర్పుతుంది’’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

మసీదులోకి చొరబడి ముస్లింలను ‘జై శ్రీరామ్’ అని నినదించాలని బలవంతం చేసిన సైన్యం - మెహబూబా ముఫ్తీ సంచలన ఆరోపణలు

కాగా.. భారతీయ జనతా పార్టీ నేడు ఉత్తర ప్రదేశ్ అంతటా "బ్లాక్ డే" ను జరుపుకుంటోంది. ఆదివారం 'మహా జన్ సంపర్క్' ప్రచారాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గౌతమబుద్ధ నగర్ లో బహిరంగ సభలో ప్రసంగించనుండగా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి, కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి ఖేరాగఢ్, ఆగ్రాలో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కైరానా, మీరట్, ఘజియాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిచున్నారు. 

విభేదాలు మర్చిపోయి ముందుకు సాగుదాం -ఢిల్లీ ఆర్డినెన్స్ వివాదం నేపథ్యంలో రాహుల్ గాంధీకి కేజ్రీవాల్ సూచన

1975 జూన్ 25న భారతదేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఇది మార్చి 21 1977 వరకు అంటే సుమారు 21 నెలల అమ‌లులో ఉంది. అప్ప‌టి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వ సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం అంతర్గత అవాంతరాల కారణంగా రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈ ఎమర్జెన్సీరని ప్ర‌క‌టించారు. ఈ సమయంలో రాజ్యాంగం కింద పౌరుల‌కు ల‌భించిన ప్రాథమిక హక్కులన్నీ నిలిచిపోయాయి. మీడియాను నియంత్రించారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ఎందరో అరెస్టుకు గుర‌య్యారు. అనేక మంది బీజేపీ నాయ‌కులు జైలు పాల‌య్యారు. అందుకే ఈ కాలాన్ని ఆ పార్టీ బ్లాక్ డే స్ గా ప‌రిగ‌ణిస్తుంటుంది.