వివాహ వేడుకకు హాజరై వస్తున్న కుటుంబంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రెండేళ్ల చిన్నారికి తీవ్రగాయాలు కావడంతో ఆ పాప చనిపోయింది. ఈ ఘటన రాజస్థాన్ లోని దుంగార్పూర్ జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేయడంతో రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన రాజస్థాన్ లోని దుంగార్పూర్ లో చోటు చేసుకుంది. చోరాసి పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ అమృత్ లాల్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారి, కుటుంబ సభ్యులు ఓ వివాహ వేడుకకు హాజరై శనివారం ఇంటికి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో వారు పోహ్రీ ఖతురత్ వద్దకు చేరుకోగానే గుర్తుతెలియని అల్లరి మూకల గుంపు వారిపై రాళ్ల దాడి చేసింది.

విభేదాలు మర్చిపోయి ముందుకు సాగుదాం -ఢిల్లీ ఆర్డినెన్స్ వివాదం నేపథ్యంలో రాహుల్ గాంధీకి కేజ్రీవాల్ సూచన

ఇలా ఒక్క సారిగా ఆ కుటుంబంపై రాళ్ల దాడి మొదలవడంతో వారు ఎక్కడికీ తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల కుటుంబ సభ్యులందరికీ గాయాలు అయ్యాయి. అయితే ఆ కుటుంబంలోని రెండేళ్ల చిన్నారి తలకు తీవ్ర గాయమైంది. బాధితులందరినీ స్థానికులు హాస్పిటల్ లో చేర్పించారు. 

ఆర్మీపైనే తిరగబడ్డ మణిపూర్ వాసులు.. 1200 మంది గుంపు చుట్టుముట్టడంతో 12 మంది మిలిటెంట్లను విడుదల చేసిన సైన్యం

అయితే అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో ఆ రెండేళ్ల చిన్నారి పరిస్థితి విషమించడంతో మరణించింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.