మహా శివరాత్రి పర్వదినం నాడు మధ్యప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఎస్‌యూవీలో చెరువులో పడి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే... భింద్ జిల్లా భరోలిఖుర్డ్ గ్రామానికి చెందిన బ్రిజ్ మోహన్ సింగ్ (50), చంద్ర భాన్‌ సింగ్ (30), బ్రిజ్‌ కిశోర్ శర్మ (25) లు ఉత్తరప్రదేశ్‌లోని కవద్ యాత్ర ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు.

ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ శుక్రవారం తెల్లవారుజామున 2.30 ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. భింద్ జిల్లాలోని పురాతన గౌరీ సరోవర్ చెరువు‌లోకి వీరి కారు దూసుకెళ్లింది.

దీనిని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఎస్‌యూవీని వెలికితీసి అందులో ఉన్న మూడు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై బ్రిజ్ మోహన్ సింగ్ కుటుంబసభ్యులకు సమాచారం అందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read Also:

పెళ్లిబృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా... ఐదుగురు మృతి

రోడ్డు దాటుతుండగా ప్రమాదం... వ్యక్తి మీద నుంచి 60వాహనాలు...

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: 18 మంది మృతి, 20 మందికి గాయాలు