చెన్నై:తమిళనాడు రాష్ట్రంలో గురువారం నాడు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది.

తిరువురు జిల్లా  అవినాశిలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. కంటైనర్ లారీ ప్రైవేట్ బస్సును ఢీకొట్టడంతో 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Also read:రాధిక కుటుంబంలో విషాదం: 8 ఏళ్ల క్రితం కొడుకు, ఇప్పుడేమో ఆ మగ్గురు మృతి

తమిళనాడు నుండి తిరువనంతపురం వెళ్తున్న బస్సును కంటైనర్ ఢీకొట్టింది. ఈ కంటైనర్ కేరళ నుండి తమిళనాడు వైపు వస్తోంది. కంటైనర్ చాలా వేగంగా ఉన్నట్టుగా స్థానికులు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ సమయంలో  కంటైనర్ టైరు పేలి ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది.  దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

కంటైనర్ లారీ ప్రైవేట్ బస్సును ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే 10 మంది మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 8 మంది మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Also read:రాధిక కుటుంబం జల సమాధి: సీసీ కెమెరాల్లో కారు గుర్తింపు

మరో వైపు ఇదే రాష్ట్రంలోని సేలం జిల్లా  ఓమనూరులో బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతి చెందినవారంతా నేపాల్ వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంంలో కూడ కారులో చిక్కుకొన్న వారిని వెలికితీసేందుకు పోలీసులు కష్టపడ్డారు.