దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 16 ఏళ్ల తెలుగు బాలికపై అత్యాచారం జరిగింది. నగరంలోని గురుటేక్ నగర్‌లో ‌నిస్సహాయ స్థితిలో ఉన్న బాలికను స్థానిక పోలీసులు గుర్తించారు.

ఆమె వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా హిందీ, ఇంగ్లీష్ భాషలను అర్థం చేసుకోలేకపోయింది. తెలుగు మాత్రమే మాట్లాడుతోంది. ఆమెను ఎవరో అత్యాచారం చేసి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించి వదిలేసినట్లు తెలుస్తోందని పోలీసులు చెప్పారు.

బాలిక మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో సంరక్షణ కేంద్రానికి తరలించి ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.