పాఠశాలలను వణికిస్తున్న కరోనా కేసులు.. జైపూర్‌లో 11 మంది విద్యార్థులకు పాజిటివ్
రాజస్తాన్‌లో మరోసారి కరోనా కలకలం రేపింది. రాష్ట్ర రాజధానిలోని ఓ పాఠశాలలో ఏకంగా 11 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. పాఠశాల యాజమాన్యం వెంటనే అప్రమత్తమైంది. కరోనా మరింత వ్యాప్తి చెందకుండా వెంటనే స్కూల్‌ను మూసేస్తు నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నుంచే రాష్ట్రంలో పలు ఆంక్షలతో పాఠశాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే.
జైపూర్: Corona కేసుల ఉధృతి తగ్గిందని, పాఠశాలలు మళ్లీ ఓపెన్ చేయాలనే నిర్ణయాలు ఇటీవల చాలా లరాష్ట్రాలు తీసుకున్నాయి. మొత్తంగా చూస్తే దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కరోనా టీకా పంపిణీ(Vaccination) కూడా వేగంగా సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే పిల్లలను Schoolsకు పంపితే ముప్పేమీ ఉండదనే అభిప్రాయం వచ్చింది. అందుకు అనుగుణంగానే పలు ఆంక్షల తో స్కూల్స్ తెరుచుకున్నాయి. కానీ, ఇప్పుడు కరోనా కేసులు మరోసారి పాఠశాలలను వణికిస్తున్నాయి. మొన్న ఖమ్మం జిల్లా Wyraలో స్కూల్ ఘటన మరువక ముందే రాజస్తాన్‌లోని జైపూర్‌లోని ఓ పాఠశాల కరోనాతో తెరపైకి వచ్చింది. ఆ పాఠశాలలో 11 మంది విద్యార్థులకు కరోనా Positive అని తేలింది. దీంతో కరోనా మరింత వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తగా యాజమాన్యం వెంటనే స్కూల్‌ను మూసేసింది.
సుమారు ఏడాదిన్నర తర్వాత రాజస్తాన్‌లో పాఠశాలలు సెప్టెంబర్‌లో మళ్లీ ఓపెన్ అయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు అన్నీ సెప్టెంబర్‌లో పలు ఆంక్షలతో తెరుచుకున్నాయి. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 50శాతం హాజరు నిబంధనతో పాఠశాలు సెప్టెంబర్‌లో ఓపెన్ అయ్యాయి. కాగా, ఎనిమిదో తరగతి లోపు పిల్లలకు విద్యా బోధన ఇంకా ఆన్‌లైన్‌లోనే కొనసాగుతున్నది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 50 శాతం హాజరుతో రాష్ట్రంలోని పాఠశాలలు అన్ని తెరుచుకోవాలని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, ఆ పాఠశాలలో బోధిస్తున్న ఉపాధ్యాయులు కనీసం సింగిల్ డోస్ అయినా సరే టీకా వేసుకుని ఉండాలనే నిబంధన పెట్టింది. తాజాగా, జైపూర్‌లోని పాఠశాలలో కరోనా కేసులు వెలుగు చూశాయి.
Also Read: రెసిడెన్షియల్ స్కూల్‌లో కరోనా టెన్షన్: వైరాలో 27 మంది విద్యార్థులకు కోవిడ్
ఇటీవలే ఖమ్మంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వైరాలోని ప్రభుత్వ బాలికల గురుకులంలో 28 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ గురుకులంలోని 650 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ఇంటికి వెళ్లొచ్చిన ఓ విద్యార్థినికి జ్వరం, అస్వస్థతగా ఉండటంతో గురుకుల అధికారులు ఆమెకు కరోనా పరీక్షలు చేయించారు. దీంతో ఈ విద్యార్ధినికి కరోనా వైరస్ సోకిందని తేలింది. దీంతో గురుకుల స్కూల్‌లోని విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించారు. దీంతో 28 మందికి కరోనా నిర్ధారణ అయింది. విద్యార్ధుల తల్లిదండ్రులకు స్కూల్ ప్రిన్సిపల్ సమాచారం ఇచ్చారు.
Also Read: 538 రోజుల కనిష్టానికి కోవిడ్ కేసులు: ఇండియాలో మొత్తం కేసులు 3,45,18,901కి చేరిక
వైరా గురుకుల పాఠశాలలో కరోనా నిర్ధారణ కావడంతో స్కూల్ ను శానిటైజేషన్ చేయించారు. కరోనా సోకిన విద్యార్ధులను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఇతర విద్యార్ధులకు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలు సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. అయితే కరోనా జాగ్రత్తలు తీసుకొంటూ విద్యా సంస్థలను ప్రారంభించాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూల్స్ కు గత మాసంలోనే హైకోర్టు అనుమతిని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.మరో వైపు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది.కరోనా వ్యాక్సిన్ ను వేగవంతం చేసింది