538 రోజుల కనిష్టానికి కోవిడ్ కేసులు: ఇండియాలో మొత్తం కేసులు 3,45,18,901కి చేరిక


ఇండియాలో కరోనా కేసులు 10 వేల దిగువన నమోదయ్యాయి.నిన్న ఒక్క రోజే 8,488 కరోనా కేసులు నమోదైతే కేరళ రాష్ట్రంలోనే 5,080 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా కేసులు కేరళ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టడం లేదు.

India reports 8,488 new corona cases  last 24 hours, total rises to 3,45,18,901


న్యూఢిల్లీ:ఇండియాలో గత 24 గంటల్లో 8,488 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 3,45,18,901కి చేరుకొన్నాయి. 538 రోజుల కనిష్ట స్థాయికి కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.దేశంలో కరోనా కేసులు 10 వేలకు దిగువన నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఊపిరి పీల్చుకొంటున్నారు. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే రికార్డయ్యాయి. కేరళ రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 5,080 కరోనా కేసులు రికార్డయ్యాయి.

నిన్న ఒక్క రోజే coronaతో 249 మంది మంది మరణించారు. దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,65,911కి చేరింది. Indiaలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,18,443కి చేరింది. కోవిడ్ యాక్టివ్ కేసులు 534 రోజుల్లో కనిష్టానికి చేరుకొన్నాయని icmr తెలిపింది. కరోనా యాక్టివ్ కేసులు 0.34 శాతానికి తగ్గాయి. రికవరీ రేటు 98.31 శాతంగా నమోదైంది. 

also read:తెలంగాణ: 24 గంటల్లో 134 మందికి కరోనా పాజిటివ్.. 6,74,318కి చేరిన కేసుల సంఖ్య

నిన్న ఒక్క రోజే కరోనా నుండి 12, 510 మంది కోలుకొన్నారు. దీంతో కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 3,39,34,547 గా నమోదైంది. 2020 మార్చి నుండి కరోనా రోగుల రికవరీ రేటు అత్యధికంగా ఉందని అధికారులు తెలిపారు. నిన్న ఒక్క రోజే 32,99,337 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ అందించారు. దీంతో 116 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు అందించారు.వారాంతపు కరోనా పాజిటివిటీ రేటు 1.08 శాతంగా నమోదైంది.  వీక్లి కరోనా పాజిటివిటీ రేటు 49 రోజులుగా 2 శాతానికి తక్కువగా నమోదౌతుంది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 1.08 శాతంగా రికార్డైంది. 49 రోజులుగా 2 శాతం కంటే రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి.

ఇండియాలో 2020 ఆగష్టు 7న 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు,సెప్టెంబర్ 16న 50 లక్షలకు కరోనా కేసులు చేరాయి. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసులు దాటాయి.డిసెంబర్ 19న కోటి కేసులను దాటాయి.ఈ ఏడాది మే 4న  రెండు కోట్ల కేసులను దాటాయి.ఈ ఏడాది జూన్ 23న కరోనా కేసులు మూడు కోట్లను దాటాయి

ఢిల్లీలో 29 కొత్త కేసులు నమోదయ్యాయి. 45 మంది కరోనా నుండి కోలుకొన్నారు. కేరళ రాష్ట్రంలో 5,080 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 7908 మంది కరోనా నుండి కోలుకొన్నారు. నిన్న ఒక్క రోజే కరోనాతో కేరళలో 40 మంది చనిపోయారు.కేరళ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 37495కి చేరుకొన్నాయి.కేరళ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 37495కి చేరుకొన్నాయి.నిన్న ఒక్క రోజు కేరళలో 7,908 మంది కోలుకొన్నారు. దీంతో రాష్ట్రంలో  కరోనా నుండి కోలుకొన్న వారి సంఖ్య 50,04,786కి చేరింది. కర్ణాటకలో 247 కొత్త కరోనా కేసులు రికార్డయ్యాయి. 278 మంది కరోనా నుండి కోలుకొన్నారు. కరోనాతో ఒక్కరు మరణించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios