రెసిడెన్షియల్ స్కూల్‌లో కరోనా టెన్షన్: వైరాలో 27 మంది విద్యార్థులకు కోవిడ్
వైరా రెసిడెన్షియల్ స్కూల్ లోని 27 మంది విద్యార్ధులకు కరోనా సోకింది. ఇటీవలనే ఇంటికి వెళ్లి వచ్చిన విద్యార్ధినికి జ్వరం రావడంతో పరీక్షలు నిర్వహిస్తే కరోనా వచ్చినట్టుగా నిర్ధారణ అయింది. మిగిలిన విద్యార్ధులకు కూడ ఆమె ద్వారానే కరోనా సోకినట్టుగా గుర్తించారు.
వైరా: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా బాలికల గురుకుల పాఠశాలలో 27 మంది విద్యార్ధులకు కరోనా సోకింది. దీంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గురుకులంలోని 650 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ఇంటికి వెళ్లొచ్చిన ఓ విద్యార్థినికి జ్వరం, అస్వస్థతగా ఉండటంతో గురుకులం అధికారులు ఆమెకు కరోనా పరీక్షలు చేయించారు.
wyara గురుకులంలోని 650 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ఇంటికి వెళ్లొచ్చిన ఓ విద్యార్థినికి జ్వరం, అస్వస్థతగా ఉండటంతో గురుకుల అధికారులు ఆమెకు కరోనా పరీక్షలు చేయించారు.దీంతో ఈ విద్యార్ధినికి Corona సోకిందని తేలింది. దీంతో గురుకుల స్కూల్ లోని విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించారు. దీంతో 27 మందికి కరోనా నిర్ధారణ అయింది. విద్యార్ధుల తల్లిదండ్రులకు స్కూల్ ప్రిన్సిపల్ సమాచారం ఇచ్చారు.
also read:తెలంగాణ: 24 గంటల్లో 134 మందికి కరోనా పాజిటివ్.. 6,74,318కి చేరిన కేసుల సంఖ్య
వైరా గురుకుల పాఠశాలలో కరోనా నిర్ధారణ కావడంతో స్కూల్ ను శానిటైజేషన్ చేయించారు. కరోనా సోకిన విద్యార్ధులను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఇతర విద్యార్ధులకు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలు సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. అయితే కరోనా జాగ్రత్తలు తీసుకొంటూ విద్యా సంస్థలను ప్రారంభించాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూల్స్ కు గత మాసంలోనే హైకోర్టు అనుమతిని ఇచ్చింది.
ఇంటర్ పరీక్షల నిమిత్తం రెసిడెన్షియల్ కాలేజీలు, హాస్టల్స్ ను తెరిచేందుకు అనుమతిని కోరింది. దీంతో హైకోర్టు అనుమతిని ఇచ్చింది. రెసిడెన్షియల్ స్కూల్స్ ను తెరిచేందుక హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రెసిడెన్షియల్ స్కూల్స్ లో కరోనా కేసులు పెరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కరోనా ప్రోటోకాల్స్ ను పాటించాలని కూడా సూచించింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.మరో వైపు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది.కరోనా వ్యాక్సిన్ ను వేగవంతం చేసింది
ఇక గత 24 గంటల్లో తెలంగాణలో నమోదైన కేసుల వివరాలిలా ఉన్నాయి., ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 5, జీహెచ్ఎంసీ 44, జగిత్యాల 6, జనగామ 0, జయశంకర్ భూపాలపల్లి 1, గద్వాల 1, కామారెడ్డి 1, కరీంనగర్ 5, ఖమ్మం 6, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 1, మంచిర్యాల 2, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 9, ములుగు 0, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 4, నారాయణపేట 0, నిర్మల్ 2, నిజామాబాద్ 2, పెద్దపల్లి 1, సిరిసిల్ల 3, రంగారెడ్డి 14, సిద్దిపేట 3, సంగారెడ్డి 3, సూర్యాపేట 2, వికారాబాద్ 0, వనపర్తి 2, వరంగల్ రూరల్ 1, వరంగల్ అర్బన్ 5, యాదాద్రి భువనగిరిలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి.కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకొంటున్నారు.