కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి దేశానికి తీరని లోటని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్ జైట్లీ... శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా... ఆయన మృతికి రాజ్ నాథ్ సింగ్ సంతాపం తెలియజేశారు. జైట్లీ దేశానికి చేసిన కృషిని ఈ సందర్భంగా రాజ్ నాథ్ గుర్తు చేసుకున్నారు.  ట్విట్టర్ వేదికగా ఆయన గొప్పతనాన్ని ఆయన తెలియజేశారు.

దేశ ఆర్థిక వ్యవస్థను చీకటి నుంచి బయటపడేసిన గొప్ప వ్యక్తి జైట్లీ అంటూ రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. అంతటి గొప్ప వ్యక్తిని దేశం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందన్నారు. ఆయన లేని లోటు తీరనిదన్నారు. జైట్లీ లోటు తమ భారతీయ జనతా పార్టీ కి ఎవరూ తీర్చలేరని అన్నారు. ఈ సందర్భంగా ఆయన జైట్లీ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

జైట్లీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆగస్టు8వ తేదీన ఎయిమ్స్ లో చేరిన జైట్లీ శనివారు తుది శ్వాస విడిచారు. కాగా... ఆయన మార్త విని.. ఇప్పటికే హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. 

 

related news

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

అరుణ్ జైట్లీ: తెర వెనక వ్యూహకర్త, సుష్మా స్వరాజ్ లాగే...

అరుణ్‌జైట్లీ ప్రస్థానం: విద్యార్ధి నేత నుండి కేంద్ర మంత్రిగా....

డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

అరుణ్ జైట్లీ మృతి.. ఢిల్లీకి అమిత్ షా పయనం