అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల్లో  ప్రచారానికి కేవలం 15 నుండి 20 రోజుల వరకు కూడ ఉండే అవకాశం ఉంది. సరిగ్గా నెల రోజుల్లోనే ఎన్నికలు ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌కు కూడ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో కేవలం పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీకి కూడ ఎన్నికలు జరగనున్నడంతో ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్షగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ నెల 18వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు.  పోలింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్ మాత్రం ఈ ఏడాది మే 23వ తేదీన రానున్నాయి.

ఇవాళ్టికి ఎన్నికలు జరగడానికి సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత సుమారు 42 రోజుల  వరకు  ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే మొదటి విడత ఎన్నికల్లో జాతీయ పార్టీల నేతలు ఈ రెండు రాష్ట్రాల కేంద్రీకరణ కొంత తక్కువగా ఉండే అవకాశం లేకపోలేదు.

సంబంధిత వార్తలు

ఏప్రిల్ 11న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల