న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను  కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 

ఆదివారం నాడు సీఈసీ సునీల్ ఆరోరా న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 17వ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. చాలా రోజుల నుండి ఎన్నికల కోసం ఏర్పాట్లు చేశామని చెప్పారు.  రైతులకు ఇబ్బంది లేకుండా ఎన్నికల షెడ్యూల్ ఉంటుందని చెప్పారు. 

పండుగలు, పరీక్షలను  పరిగణనలోకి తీసుకొన్నామని ఆయన గుర్తు చేశారు.ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే ముందు అన్ని రాష్ట్రాల ఎన్నికల  అధికారులతో చర్చించినట్టు ఆయన తెలిపారు. 

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొదటి విడత నోటిఫికేషన్  ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. నామినేషన్ల దాఖలుకు  మార్చి 25వ  చివరి తేదీ, ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహించనున్నారు. 

దేశంలోని 99.36 ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులన     జారీ చేశామన్నారు.కేంద్ర పాలిత ప్రాంతాల్లో వందకు వందశాతం ఓటరు గుర్తింపు కార్డులను  పంపినీ చేశామన్నారు. పోలింగ్‌కు ఐదు రోజుల ముందే ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తామన్నారు.ఈ దఫా పోలింగ్‌లో 90 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకొనే ఛాన్స్ ఉందని ఆయన తెలిపారు. 2014 ఎన్నికల తర్వాత 8 కోట్ల 40 లక్షల మంది కొత్త ఒటర్లుగా పేర్లు నమోదు చేసుకొన్నారన్నారు.

ఓటరు హెల్ప్ లైన్ కోసం 1950 నెంబర్ ను ఏర్పాటు చేశామన్నారు. ఇవాళ్టి నుండే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు. సమస్యాత్మక  ప్రాంతాల్లో  ప్రత్యేకంగా అబ్జర్వర్లను పంపుతామని ఆయన తెలిపారు.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. 

మొదటి విడత నోటిఫికేషన్  ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. నామినేషన్ల దాఖలుకు  మార్చి 25వ  చివరి తేదీ, ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహించనున్నారు. 20 రాష్ట్రాల్లోని 91 ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడత ఎన్నికలను  18 ఏప్రిల్ నిర్వహించనున్నారు.  97 ఎంపీ స్థానాలకు 13 రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు సునీల్ ఆరోరా తెలిపారు. 

మూడో విడత ఎన్నికలు   23 ఏప్రిల్ న నిర్వహించనున్నారు.  14 రాష్ట్రాల్లోని 150 ఎంపీ సెగ్మెంట్లకు ఎన్నికలు నిర్వహిస్తారు.నాలుగో విడతలో ఏప్రిల్ 29న ఎన్నికలు నిర్వహిస్తారు.  9 రాష్ట్రాల్లోని 71 ఎంపీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఐదో విడత మే 6వ తేదీన  ఎన్నికలు నిర్వహించనున్నారు.  7 రాష్ట్రాల్లోని 51 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని సీఈసీ ప్రకటించింది.

ఆరో విడత ఎన్నికలను  మే 12 తేదీన 7 రాష్ట్రాల్లోని 51 ఎంపీ సెగ్మెంట్లకు ఎన్నికలను నిర్వహించనున్నారు. మే 19వ తేదీన ఏడో విడత ఎన్నికలను  నిర్వహించనున్నారు. 8 రాష్ట్రాల్లోని 59 ఎంపీ స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు.
 

ఏప్రిల్ 11న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు