న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 11 వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలకు, తెలంగాణ 17 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.తొలి విడతలోనే ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది మే 23వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు.

ఏపీ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడ ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే నిర్వహించనున్నారు. ఈ నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 

ఈ నెల 18వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల దాఖలుకు చివరి తేది. ఈ నెల 26వ తేదీ నుండి నామినేషన్లను పరిశీలించనున్నారు.  ఈ నెల 28న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు.

ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 23వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల