ఉదయాన్నే టీ లో నెయ్యి కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?

ఉదయాన్నే టీ తాగేదాకా ఏ పని ముట్టుకోని వారు ఉన్నారు. టీ మన నిద్రమబ్బును పోగొట్టి ఎనర్జిటిక్ గా మారుస్తుంది. ఇలాంటి టీలో ఒక టీ స్పూన్ నెయ్యిని కలిపి తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? 
 

what happens if you add 1 spoon of ghee in your morning tea rsl

చాయ్ మన రోజువారి దినచర్యలో ఒక భాగంగా మారిపోయింది. ముఖ్యంగా ఉదయాన్నే టీ తాగకుండా అస్సలు ఉండలేం. టీ మనల్ని ఎనర్జిటిక్ గా మార్చేసి రీఫ్రెష్ నెస్ ను ఇస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ టీని పొద్దు పొద్దునే తాగుతారు. కానీ ఉదయాన్నే పరిగడుపున టీ తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే పరిగడుపున టీని తాగకూడదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెప్తారు. కానీ మీరు తాగే టీలో నెయ్యి కలిపి తాగితే మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. నెయ్యిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే దీన్ని రోజూ ఒక టీ స్పూన్ తినాలని చెప్తారు. పాలలో నెయ్యి కలిపి తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలిసే ఉంటాయి. కానీ టీలో ఒక టీస్పూన్ నెయ్యిని కలిపి తాగితే మీకు లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న ముచ్చట చాలా మందికి తెలియదు. అందుకే దీని గురించి ఓ లుక్కేద్దాం పదండి.

నెయ్యిలో లినోలెయిక్ ఆమ్లం, ఆరోగ్యకరమైన కొవ్వులు, బురిటిక్ ఆమ్లం, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో పాటుగా ఎన్నో ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.  ఉదయం మీరు తాగే టీలో ఒక టీ స్పూన్ నెయ్యిని కలిపి తాగడం వల్ల మీకు తక్షణ ఎనర్జీ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

టీలో నెయ్యిని కలిపి తాగడం వల్ల మీకు రోజంతా రీఫ్రెష్ అనుభూతి కలుగుతుంది. దీంతో మీరు మీ రోజువారి పనులను మరింత ఫాస్ట్ గా చేసుకుంటారు. చాయ్ లో ఉండే కెఫిన్ కంటెంట్ మన మెదడును ఉత్తేజపరుస్తుంది. మీకు తెలుసా? నెయ్యిలో మెదడుకు బలాన్నిచ్చే గుణాలు కూడా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు ఈ రెండింటినీ కలిపి తాగితే మీ మెదడు ఉత్తేజపడుతుంది. 

టీలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల మెదడు ఆరోగ్యంగా కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చాయ్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇలాంటి టీలో నెయ్యిని కలిపి తాగితే స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గిపోతాయి. ఉదయాన్నే టీలో నెయ్యిని కలుపుకుని తాగితే ఒత్తిడి తగ్గి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది.

నెయ్యి తీసుకోవడం వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. మూడ్ స్వింగ్స్ కూడా తగ్గుతాయి. టీలో నెయ్యిని వేసి కలిపి తాగితే మీకు వ్యాధులు సోకే అవకాశమే ఉండదు. ఎందుకంటే నెయ్యి మీ ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంచుతుంది.  ఈ విధంగా మీరు ఉదయాన్నే టీ తాగితే దీనిలో ఉండే పోషకాలు, కేలరీలు రెండూ మీకు అందుతాయి. ఇది అలసట, బలహీనత, సోమరితనాన్ని కూడా దూరం చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు ఇలా టీని రోజుకు ఒకసారి మాత్రమే తాగాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios