Kitchen Appliances: గల్ఫ్ దేశాల్లోని గొడవల వల్ల గ్యాస్ సిలిండర్లకు మనదేశంలో కొరత వచ్చేసింది. చాలా హోటళ్లు మూసేశారు. దీంతో చాలామంది గ్యాస్‌కు బదులుగా వంట చేయడానికి ఇతర మార్గాలను వెతుకుతున్నారు. అలాంటి వాటిలో ఈ నాలుగు వంట గది ఉపకరణాలు ఉంటే చాలు.
ఇరాజ్ ఇజ్రాయెల్ యుద్దం మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా మనదేశంలో గ్యాస్ కు కొరత ఏర్పడుతోంది. చాలా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు గ్యాస్ కొరతతో ఏకంగా మూసివేశారు. ఇక ఇంటి అవసరాలకు కూడా కొంతమంది గ్యాస్ కోసం ఇబ్బంది పడుతున్నారు. నిజానికి గ్యాస్ స్టవ్, సిలిండర్ తో అవసరం లేకుండానే పూర్తిగా కరెంటుతో వంట పూర్తి చేసుకోవచ్చు. దీనికి కావాల్సినదిన నాలుగు ఎలక్ట్రిక్ వస్తువులు. ఈ నాలుగు కిచెన్ అప్లయెన్సెస్ ఉంటే చాలు గ్యాస్ తో అవసరమే లేదు.
1. ఇండక్షన్ కుక్‌టాప్
ఇప్పుడు మార్కెట్లో ఎన్నో ఇండక్షన్ స్టవ్ లు అందుబాటులోకి ఉన్నాయి. ఎన్నో ప్రఖ్యాత కంపెనీలు ఇండక్షన్ కుక్‌టాప్ లను అమ్మతున్నాయి. ఇది పూర్తిగా కరెంట్‌తో పనిచేస్తుంది. దీన్ని వాడటం కూడా చాలా సులభం. గ్యాస్ కంటే నిజానికి ఇదే చాలా సురక్షితం కూడా. టీ, కాఫీ, అన్నం, కూరలు, పరోటా, మ్యాగీ, పాస్తా లాంటివి దీనిపై చాలా వేగంగా వండేయొచ్చు. అంతే కాదు చక్కగా అన్ని రకాల వంటలు వండుకోవచ్చు. దీని ధరలు కూడా 1500 రూపాయల నుంచే ఉంటుంది కాబట్టి ఎవరైనా కొనగలరు.
2. మైక్రోవేవ్ ఓవెన్
మైక్రోవేవ్ ఓవెన్ కేవలం ఆహారాన్ని వేడి చేయడానికి మాత్రమే అనుకుంటారు. కానీ దీని వంట కూడా చేసుకోవచ్చు. దీనిలో బేకింగ్, గ్రిల్లింగ్ వంటివి చేయవచ్చు. కూరలు, ఇన్‌స్టంట్ పాయసం, కప్ కేక్స్ కూడా ఇందులో తయారు చేసుకోవచ్చు.
3. ఎయిర్ ఫ్రైయర్
ఎయిర్ ఫ్రైయర్ వాడకం ఇప్పుడు పెరిగింది. దీనిలో నూనె అవసరమే లేకుండా ఎన్నో రకాల వేపుళ్లు చేసుకోవచ్చు. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కరెంట్ కూడా తక్కువే కాలుతుంది. పనీర్, కాలీఫ్లవర్, బంగాళదుంప వంటి వాటిని తక్కువ నూనెతో ఫ్రై చేసుకోవచ్చు. క్రిస్పీగా కూడ వస్తాయి. ఇక చికెన్, ఫిష్ వంటి నూనెలో డీప్ ఫ్రై చేసే కన్నా ఇందులో ఒక స్పూను నూనెతోనే వేయించుకోవచ్చు.
4. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంటే చాలు ఎన్ని సార్లయినా అన్నం వండుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువమంది ఇళ్లలో ఇది ఉండడం చాలా కామన్ అయిపోయింది. ఇందులో అన్నం మాత్రమే కాదు, పులావ్, కిచిడీ, సూప్, నూడుల్స్ కూడా వండుకోవచ్చు. గుడ్లు ఉడకబెట్టడానికి కూడా దీన్ని వాడుతున్నారు. కరెంట్‌తో పనిచేసే ఈ పరికరం వంటను వేగంగా పూర్తి చేయడానికి సాయపడుతుంది. రుచిలో కూడా పెద్దగా తేడా ఉండదు.


