Asianet News TeluguAsianet News Telugu

ఫస్ట్ డేట్‌ అంటే టెన్షన్ పెరుగుతోందా ఇలా చేయండి మరి!

పది పదిహేనేళ్ల క్రితం డేటింగ్ అంటే భారతదేశంలో చాలామందికి అనుభవంలో లేని విషయం.

No Tension on first date

పది పదిహేనేళ్ల క్రితం డేటింగ్ అంటే భారతదేశంలో చాలామందికి అనుభవంలో లేని విషయం. కాని టెక్నాలజీ, కమ్యూనికేషన్ విప్లవాల పుణ్యమా అని డేటింగ్ కల్చర్ దేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. మొదట్లో సెలబ్రిటీలకు, సినిమా తారలకు మాత్రమే పరిమితమై ఉన్న డేటింగ్ సంస్కృతి ఇప్పుడు నగరాల్లో కుర్రకారుకు సులువుగా వంటబట్టేస్తున్నట్లుంది. అయితే ఎంత ఆధునికతలోకి సమాజం అడుగుపెడుతున్నా మొదటి సారి డేటింగ్ అంటేనే ప్రత్యేకించి అమ్మాయిలకు చాలా టెన్షన్‌గా ఉంటుంది. అందులోనూ వారికి బాగా తెలిసిన అబ్బాయితో డేటింగ్ అంటే ఆ ఉద్వేగం గురించి చెప్పనక్కరలేదు. ఫస్ట్ డేట్ ఏర్పర్చుకుంటున్న సందర్భంలో మీ మనస్సులో ఏర్పడే ఉద్వేగాన్ని, ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలుసుకుందామా

తొలిసారి డేటింగ్‌ కుదుర్చుకుంటున్నప్పడు అనివార్యంగా మీ హృదయంలో చెలరేగే ఉద్రిక్తత, టెన్షన్‌లను తొలగించుకోవడానికి మొదట చేయవలసింది ఎదుటి వ్యక్తికి మల్లే మీరు కూడా చాలా కంట్రోల్‌గా అదుపులో ఉంటున్నట్లు మీకు మీరు భావించుకోవాలి. అలా అదుపు చేసుకోవడం సాధ్యం కాదని అర్థమైనప్పుడు ఆ చోటు నుంచి తప్పుకోవాలి. ఎదుటి అబ్బాయితో సౌకర్యంగా లేదని అనిపిస్తుంటే ఆ మరుక్షణం మీరు ఆ సంబంధం నుంచి బయటపడటమే ఉత్తమం.  

ఏ సంబంధంలో అయినా మీ సరిహద్దులను, పరిమితులను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఎదుటి వ్యక్తికి మీరేదో చేస్తున్నట్లు కాకుండా ఆ  పరిమితులు మీ భద్రతకు సంబంధించిన విషయంగా గుర్తు పెట్టుకోవాలి.

ఫస్ట్ డేట్‌కు మీ మనసు  అంగీకరించకపోయినా, ఏదో అసౌకర్యం లాంటిది మనసులో కలుగుతున్నా.. అబ్బాయితో డిన్నర్‌కి వెళ్లడానకి బదులుగా తక్కువ సమయంలో ముగిసే కాఫీ షాపుకు వెళ్లండి. లేదా ఇద్దరూ కలిసి అలా నడుచుకుంటూ వెళుతూ మాట్లాడుకోండి. మీకు కాస్త రిలాక్స్ అయినట్లు అనిపిస్తే అప్పడు ఈ కొత్త సంబంధంలో ముందుకెళ్లండి.

ఒక సామాజిక పరిస్థితుల్లో ఇరుక్కుని అక్కడినుంచి తప్పుకోవాలనిపించినప్పడు మీ స్నేహితురాలితో రహస్య కోడ్ టెక్స్ట్‌ని ముందస్తుగా సిద్ధం చేసుకోండి. మీరు ఎప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాన్ని తప్పకుండా మీకు సన్నిహితంగా ఉండే వ్యక్తికి తప్పకుండా తెలియచేస్తూ ఉండండి.

మనం ఎలా ఉంటున్నాం, ఏం ఫీలవుతున్నాం అనే అంశంలో మనకు స్పష్టత లేని సందర్భాల్లో చాలాసార్లు మనం ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టబడతాం. దీంతో మీరు కుదుర్చుకుంటున్న డేటింగ్ విషయంలో మిస్ కమ్యూనికేషన్, సమాచార లోపం జరిగి సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీ ఫీలింగ్స్, భావాలు ఎలా ఉంటున్నాయి అనేది ముందస్తుగా నిర్ధారంచుకుని తదనుగుణంగా స్పందించాల్సి ఉంటుంది.

చివరగా డేటింగ్ అనేది మీకు సౌకర్యం కలిగించే మంచి అనుభవంగా ఉండాలి కానీ ఎందుకు తగులుకున్నామా అనిపించేలా ఉండకూడదు.

Follow Us:
Download App:
  • android
  • ios