ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్ని జలమయమై ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది… కాబట్టి వర్షాకాలంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సురక్షిత ప్రయాణానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

గత కొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి.. ఈ వర్షాలు రోడ్డు ప్రమాదాలకు కూడా కారణం అవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి… దీంతో చాలా చోట్ల రోడ్లు దెబ్బతింటున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో అయితే ఈ వర్షపునీరు రోడ్లపై ప్రవహించడంతో ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయి. 

ఇలా వర్షంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పెద్ద ప్రమాదాలు జరగొచ్చు. వర్షాకాలంలో సురక్షితంగా వాహనం నడిపేందుకు కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. 

కారు నడిపేవారికి సూచనలు

రెండు చేతులతో హ్యాండిల్ పట్టుకుని వాహనాన్ని నడపండి... ఒకే చేత్తో స్టైల్ గా నడుపుతామంటే ప్రమాదాల బారిన పడతారు. వాహన వేగాన్ని తగ్గించండి. ఇతర వాహనాలతో తగినంత దూరం పాటించండి. మలుపుల్లో నెమ్మదిగా బ్రేక్ వేయండి.

వర్షంలో తడిసిన రోడ్లపై ముందుగానే బ్రేక్ వేయండి. హఠాత్తుగా బ్రేకులు వేయకండి. మలుపుల్లో హఠాత్తుగా స్టీరింగ్ తిప్పకండి. టైర్లు, బ్రేకులు, ఆయిల్ వంటివి నెలకోసారి చెక్ చేసుకోండి. టైర్లలో గాలి సరిగ్గా ఉన్నాయా చూసుకోండి.  రోడ్లపై అదనపు శ్రద్ధ వహించండి 

రోడ్లపై జాగ్రత్తలు

రోడ్డుకి, టైర్లకి మధ్య నీరు చేరితే వాహనం మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. నీటిలోకి వెళ్లే ముందు మీ కారు ఫస్ట్ లేదా సెకండ్ గేర్‌లో ఉందని నిర్ధారించుకోండి. లోతైన గుంతలు లేదా నీరు నిలిచిన ప్రాంతాల్లో వాహనం నడిపేటప్పుడు క్లచ్, యాక్సిలరేటర్‌పై కంట్రోల్ కలిగివుండండి.  మీ ముందున్న ఇతర వాహనాలకు తగినంత దూరం పాటించండి.

ప్రయాణంలో జాగ్రత్తలు

వర్షం ఆగే వరకు లేదా తగ్గే వరకు వాహనాన్ని ఆపడం మంచిది. వర్షంలో ముందున్న వాహనాలు కనిపించవు కాబట్టి ఎల్లప్పుడూ హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు వెలిగించండి. దీంతో మీకు స్పష్టంగా కనిపిస్తుంది… ఇతర డ్రైవర్లకు కూడా మీ కారు కనిపిస్తుంది.