వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. బ్యాక్టిరియా త్వరగా వ్యాప్తి చెందుతుంది. దీనివల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు రావద్దంటే ముఖ్యంగా కిచెన్ ని శుభ్రంగా ఉంచుకోవాలి. అదెలాగో ఇక్కడ చూద్దాం.
సాధారణంగా వర్షాకాలంలో ఎక్కువ వ్యాధులు వస్తుంటాయి. అందుకు కారణం.. బ్యాక్టిరియా, వైరస్ లే. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఇవి తొందరగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా కిచెన్ శుభ్రంగా లేకపోతే.. ఈ సమస్యలు మరింత ఎక్కువవుతాయి. కిచెన్ లో ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు పాడవడం వల్ల బ్యాక్టిరియా పెరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వర్షాకాలంలో కిచెన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.
వర్షాకాలంలో కిచెన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
చెక్కతో చేసిన వస్తువులు:
కిచెన్ లో చెక్కతో తయారు చేసిన వస్తువుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. తేమ ఎక్కువగా ఉంటే చెక్క సామాన్లకు చెదలు, బూజు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తేమను ఎదుర్కొనే మెటీరియల్ తో కవర్ చేసి పెట్టుకోవాలి.
మూత ఉండే డబ్బాలు
బిస్కెట్లు, చిప్స్, మసాలా పొడులు వర్షాకాలంలో త్వరగా పాడైపోతుటాయి. అందుకని వాటిని మూత ఉండే డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి. డబ్బాల్లోకి పురుగులు రాకుండా ఉండడానికి వేప ఆకులు పెట్టుకోవచ్చు.
హుక్స్, రాక్స్
పాత్రలను శుభ్రం చేసినప్పుడు వాటిలో నీరు ఉండకుండా చూసుకోండి. స్పూన్లు, కప్పుల వంటి వాటిని కడిగిన వెంటనే హుక్స్ కి తగిలిస్తే అందంగా ఉంటుంది.
నేలపై తడి లేకుండా..
కిచెన్ లో నేల మీద తేమ ఉంటే జారిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాట్స్ వేసుకోవాలి. ముఖ్యంగా సింక్ దగ్గర మ్యాట్ వేసుకోవడం చాలా ముఖ్యం. సింక్ పైపులు లీకులు లేకుండా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. దీనివల్ల... దోమలు, ఈగలు రాకుండా చూసుకోవచ్చు.
ఇండోర్ ప్లాంట్స్
ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటే కిచెన్ అందంగా ఉంటుంది. పుదీనా, కొత్తిమీర, తులసి ఇంట్లో బాగా పెరుగుతాయి. వాటిని అందమైన కుండీల్లో పెంచుకోవచ్చు.