కులాంతర వివాహం: మమ్మల్ని ఇది వేటాడుతూనే ఉంది, కానీ...

Inter caste marraige: The experience of couple
Highlights

సమాజంలో ఇంకా మతాంతర, కులాంతర వివాహాలకు ఆమోదం లభించడం లేదు. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న దంపతులు సామాజిక చిక్కులు ఎదుర్కుంటున్నారు. సమాజానికి ఎదురీదాల్సి వస్తోంది. కులాంతర వివాహం చేసుకున్న ఓ జంట అనుభవాలను చదువుదాం...

(సమాజంలో ఇంకా మతాంతర, కులాంతర వివాహాలకు ఆమోదం లభించడం లేదు. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న దంపతులు సామాజిక చిక్కులు ఎదుర్కుంటున్నారు. సమాజానికి ఎదురీదాల్సి వస్తోంది. కులాంతర వివాహం చేసుకున్న ఓ జంట అనుభవాలను చదువుదాం...)

కులాంతర, ఆదర్శ వివాహం. నాది రామన్నపేట మండలంలోని  మునిపంపుల. మాదిగ కులం. నా అమ్మనానలు కడుపేదలైన మేకల బాలమ్మ, పిచ్చయ్య. కష్టపడి చదివించారు. చిన్నప్పటి నుంచే కష్టం చేస్తూ చదువుకున్న. కట్టలుకొట్టా. మట్టి పనులు చేశా. నాగలి దున్నా. ఙీతం ఉన్న. నాగార్ఙునసాగర్ ఎడమ కాల్వ కింద వరి కోతలు, నాట్లు వేసేందుకెళ్లా. హైదబాద్ వెళ్లి రిక్షా తొక్కా. చిట్యాల ఉప్పరి పనిచేశా. 10వ తరగతి ఊర్లో, ఇంటర్ రామన్నపేటలో చదివాను. డిగ్రి నల్లగొండ NG COLLEGEలో చదివాను. డిఙీల్ మెకానిక్ ITI చేశా. ప్రఙాశక్తి ఙర్నలిఙం స్కూల్ శిక్షణ పొందా. అభ్యుదయ భావాలు, అంబేద్కర్ ఆలోచనల పట్ల ఆకర్శితడనై SFI/DYFI/CPIM/KVPSలో పనిచేశా. గ్రామ ప్రఙల పక్షాన పనిచేసి పెళ్లి కాకముందే  మునిపంపులలో వార్డు మెంబర్ గా/ MPTC గా గెలిచి ప్రఙాప్రతినిధిగా సేవచేశా. 2001 నుంచి ప్రఙాభిమాని,ఆంధ్రఙ్యోతి, ప్రఙాశక్తి, నవతెలంగాణ పత్రికల్లో ఙర్నలిస్టుగా  పనిచేసిన.                

నా భార్య చిలుకూరి వరుణమ్మ. చండూరు మండల కేంద్ర పంచాయతీ పరిధిలోని  లక్కినేనిగూడం. తండ్రి బుచ్చిరాంరెడ్డి. 35ఎకరాల భూస్వామి. 5 గురు ఆడపిల్లలు, కొడుకు. వరుణమ్మ చిన్నది. నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రి కాలేఙీలో చదివింది. PGDCA కంప్యూటర్ కోర్స్ చేసింది. నేను SFI ఙిల్లా కార్యదర్శిగా నల్లగొండ కేంద్రంలో పనిచేశాను. విద్యార్థి ఉద్యమాలు నడిపే క్రమంలో అనేక మందితో పరిచయాలయ్యేది. సిపిఐ కుటుంబం నుంచి వచ్చిన వరుణమ్మ కూడా  విద్యార్థి ఉద్యమాల్లో  చురుగ్గా  పాల్గొనేది. ఆ క్రమంలో ఆలోచనలు, అభిప్రాయాలు  కలవడంతో  పెళ్లి చేసుకుంటే  ఎలా  ఉంటుందనే  చర్చ వచ్చింది.

కులం పెద్ద సమస్య. అయినా ధైర్యం చేయాలని అనుకుని  పార్టీ  ఙిల్లా కార్యదర్శికి చెప్పాము. సరే అన్నారు. కానీ..! రెడ్డి కుల ప్రభావం సిపిఎంలో ఎక్కువుంది. మాకు  పెళ్లి  చేయడం కష్టం. పైగా  వరుణ బంధువులు పలుకుబడి కల్గినోళ్లు. దాడి చేస్తరు. రక్షణ కష్టం. అపుడు  ఎస్పీ రాంనారాయణను  రహస్యంగా  రాత్రిపూట కలిశాం. ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి మా వెంటరాలేదు. ఎందుకో తెలియదు. హషం తీసుకెళ్లాడు. ఎస్పీ, రామన్నపేట సిఐ మద్దిపాటి శ్రీనివాసు, ఎస్ఐ మొగులయ్య  లకు పోన్ చేసి  మా పెళ్లి పోలీస్ స్టేషన్ లో చేసి రక్షణ కల్పించాలని చెప్పారు. సిఐ, ఎస్ఐ మహిళ నాయకులు, సిపిఎం నాయకులు కలిసి  స్టేఙి  మ్యారేఙి  చేశారు. దండలు మార్చుకుని  ఒక్కటయ్యాం.

ఆ క్షణం ఎక్కడ తలదాచుకోవాలో అర్థంకాదు. రహస్యంగా హైదరాబాద్  చేరాం. పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్నాం. అక్కడా దాడి ఙరిగింది. ఎంబి భవన్ లో ఉండగా దాడి చేశారు. విద్యా నగర్ , ఈసిఐఎల్, ముసీరాబాద్ , బాగ్ లింగంపల్లి, ఎస్ వికె ఎక్కడ ఉన్నా  వరుణమ్మ ఙాడ తెలుసుకుని వచ్చి దాడి  చేశారు. పార్టీ వాళ్లు విసుగెత్తి  వరుణ తల్లిదండ్రుల్ని పిలిచి  మాట్లాడించారు. రోఙంతా వరుణను  తీసుకెళ్లి  మాట్లాడారు. అమ్మనానల్ని వదిలి నా వద్ధకే వచ్చింది. వరుణ.

బంధువులు హైదరాబాద్ లో  సిఐటియులో పనిచేయడం వల్ల మేమున్న చోటు  బంధువులకు తెలిసేది. ప్రాణభయం ఎక్కువైంది. అప్పుడు ప్రభుత్వం  తరపున ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్  ఙస్టిస్ పున్నయ్యను కలిసి రక్షణ కోరాం. సంక్షేమ భవన్ లో  కూడా  దాచుకున్నం, కుల నిర్మూలన సంఘం నాయకుల ఇళ్లలో కొన్ని రోజులున్నం. అయినా  పోషణ, రక్షణ సమస్యలు  తీరలేదు. దీంతో  మా ఊరికెళ్లాం. వ్యవసాయంచేశా. వరుణ విద్యా వాలంటీర్ గా పనిచేసింది. పూటకెళ్లేది. కానీ..! అమ్మ ఇంట్లో  గొడవపడేది. వరుణ వల్ల నాకు  ప్రాణనష్టం ఉందని  మా అమ్మ భయపడేది. ఆమేను పంపిస్తే  నాకేం కాదని వాధించేది. అలా  మా బంధువులందరూ  మాకు  దూరమయ్యారు.

మా  ఊరి రెడ్డి భూస్వామి  మా  కులపెద్దల ద్వారా  మా అమ్మ నానల్ని  బెదిరించి  అమ్మాయిని  పంపమని వత్తిడి చేశారు. లేకుంటే  చంపుతరని  చెప్పేది. ఆ పరిస్థితుల్లో   నేను  దొరకకుండా ఉండాలన్నారు. మా కఙిన్ …బ్రదర్స్  లారీ  డ్రైవర్లు. వాళ్లు రక్షణగా ఉండేది. డ్యూటీకెళ్తే  నన్నూ  క్లీనర్ గా  తీసుకెళ్లి  లారీ  డ్రవింగ్  నేర్పారు. రాఙమండ్రి to హైదరాబాద్ తిరిగేటప్పుడు  ఎవరూ  గుర్తించకుండా  ఆయిల్ బట్టలే  వేసుకునేది. కట్టింగ్ చేయించకపోయేది. 2  ఏళ్లు అలా  దాచుకుని బతికాను. మాకు  2001  లో పాప పుట్టింది. 3 ఏళ్లు  గొడవలతో గడిచింది. తర్వాత ఉపాధి  కోస నేను ఎల్ఎల్ బిలో, వరుణ బిఈడిలో చేరాం ఫీజు కట్టడం కష్టమైంది. కాలేజీకి  వెళ్తే  పూట గడవకపోయేది. దీంతో  మిత్రుడు  రమణారెడ్డి  తన పత్రికలో  పనికల్పించాడు. 3 ఏళ్ల తర్వాత మిత్రుడు మహేందర్ రెడ్డి  సహకారంతో  ఆంధ్రఙ్యోతిలో అవకాశం  వచ్చింది. 3 ఏళ్ల తర్వాత ప్రఙాశక్తి  ఙర్నలిఙం స్కూల్లో  చేరి  స్టాఫర్ అయ్యాను.

కొద్దిపాటి లైన్ ఎకౌంట్ తో కష్టమయ్యేది. వరుణ చీరలకు  డిఙైన్లు వేసి డబ్బు సంపాదించేది. రాత్రింబవళ్లూ  కుట్టేది. ఆమే కూడా బిఎ, బీఈడి చేసినందున ఙర్నలిఙంలో  చేరి 11ఏళ్లు  డెస్క్ ఙర్నలిస్టూగా కొనసాగుతోంది. మా  కుటుంబంలో   అక్కబావ, మా కఙిన్ బ్రదర్స్ తప్ప  అందరూ  మాకు  దూరంగనే ఉన్నారు. వీళ్లకు కుల సమస్యకాదు. కానీ..! మాకు డబ్బులేకపోవడం. ఇప్పుడు మాత్రం వాళ్ల ఆపదలు, కష్టాలు  తీర్చేందుకు  నేనే దిక్కయ్యాను.

వరుణను  వాళ్ల ఊరు, ఇంటికి  ఇప్పటికీ  రానివ్వరు. పెళ్లిళ్లు, చావులకూ పిలవరు. పోతే రానివ్వలేదు. 5 ఏళ్ల క్రితం వరుణ తండ్రి బుచ్చిరెడ్డి  చనిపోతే ఆమెను  అంత్యక్రియలకు  రానివ్వలేదు. ఒకరిద్దరు బంధువులు  ఙర్నలిస్టులున్నరు. వాళ్లు పోన్ లో మాట్లాడడం తప్ప ఇళకు రారు. మమ్ముల్ని పిలవరు. భౌతిక దాడులు, సామాఙిక అవరోధాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక సమస్యలు, అవమానాలు ఎన్నో ఎదురైనయి. 20 ఏళ్ల కాపురంలో  ఏనాడు  నా భార్య కుంగిపోలేదు. సమాఙానికి ఎదురీదుతోంది. ఆదర్శవంతమైన ఇల్లాలే  కాదు,  ప్రేమికురాలు కూడా. నా పట్ల అత్యంత ప్రేమే కాదు  అచంచల విశ్వాసం కల్గి ఉంటది.

బాధలొస్తే ఆమె భయపడిన  దాఖలాల్లేవు. బాధలు, అవమానాలు, కష్టాలను సమంగా పంచుకుంటూ సాగిపోతున్నం .మా  ఆశ, మా  శ్వాస మా  ప్రాణం మా ఆస్తి అన్నీ  మా  పిల్లలే.  10 ఏళ్లు  మేము  ఎవరి శుభ, అశుభ కార్యాలకు  వెళ్లలేదు. అంతటి ఒంటరితనం  మమ్ముల్ని  మానసికంగా కుంగదీసింది. అందుకే మేము మా పిల్లలకు...మా పిల్లలు  మాకు  ఓ అద్భుత ప్రపంచంగా బతుకుతున్నం.   మా పిల్లలకు సమాఙంలో  కులం, మతం, డబ్బు విషయాల గురించి అవగహన కల్పిస్తూ పెంచుతం.  మేము    ఒంటరి  కావచ్చు  కానీ..! మా ఆదర్శం..ఆశయం  ఒంటరివి కావు అనే మనో దైర్యమే మమ్ముల్ని  ముందుకు నడుపుతుంది.                  

-మేకల  కృష్ణయ్య

loader