Pongal:ఆ గుడిలో.. పురుషులే పొంగలి తయారు చేస్తారు..!
అక్కడ పురుషులు మాత్రమే పొంగలి తయారు చేయాలి. అది అక్కడ ఆచారం కావడంవిశేషం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..? మన ఆంధ్రప్రదేశ్ లోనే.
సాధారణంగా.. ఏ గుడిలో అయినా.. పొంగలి ప్రసాదం స్త్రీలు మాత్రమే తయారు చేస్తారు. గుడిలోని స్వామివారికి, అమ్మవారికి నైవేద్యం సమర్పించాల్సి వస్తే.. స్త్రీలు వాటిని తయారు చేస్తారు. కానీ.. ఒక ఆలయంలో మాత్రం.. అక్కడ పురుషులు మాత్రమే పొంగలి తయారు చేయాలి. అది అక్కడ ఆచారం కావడంవిశేషం. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..? మన ఆంధ్రప్రదేశ్ లోనే.
కడప జిల్లాలోని పుల్లంపేట మండలంలో తరతరాల నుంచి ఈ ఆచారం ఆనవాయితీగా వస్తోంది. దీనినే శ్రీ సంజీవరాయ స్వామివారి పొంగళ్లుగా పిలుస్తారు. పుల్లంపేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో మగవాళ్లు శ్రీ సంజీవరాయ స్వామివారి పొంగళ్లను ఘనంగా జరుపుకుంటారు.. సంక్రాంతి పండగ కంటే పొంగళ్లు పండగనే ఎంతో ఘనంగా జరుపుకుంటారు..పెద్ద పండగ కి ముందు వచ్చే ఆదివారం ఇలా చేస్తారు. ఇందుకోసం ఈ ఊరు వాళ్ళు ఇతర ప్రాంతాల్లో ఎక్కడున్నా సరే… తప్పకుండా ఆ రోజుకి స్వగ్రామం చేరుకుంటారు.
అయితే, ఇక్కడ మహిళలు మాత్రం ఆలయం లోకి రాకుండా వెలుపల నుంచే స్వామిని దర్శించుకుంటారు. అంతే కాదు స్వామి వారికి పెట్టిన నైవేద్యాన్ని కూడా మగవాళ్లే తినాలి అన్నది ఆచారం. దానిని ఆడవాళ్లు ఎవరు కనీసం తాకటానికి కూడా వీల్లేదు..అలానే ఇక్కడ సంజీవరాయునికి విగ్రహమంటూ లేదు. ఇక్కడ ప్రతిష్టించిన రాతిపై గల శాసనాన్ని వారు దైవంగా భావిస్తారు..దానినే అంతా పూజిస్తారు. ఇలా మహిళలకు ప్రవేశం లేకుండా.. కనీసం ప్రసాదం స్వీకరించకూడని ఆయలం ఇదే కాబోలు.