పసుపు, అల్లం కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?

ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన వరాలను అందించింది. ఆరోగ్యానికి మంచి చేసే వస్తువులన్నింటినీ ప్రకృతి మనకు అందించింది. అలాంటి వాటిలో పసుపు, అల్లం ఒకటి. మరి ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది. ఎలాంటి లాభాలు ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Health benefits with turmeric and ginger powder VNR

మనకు వచ్చే ప్రతీ అనారోగ్య సమస్యకు ఆయుర్వేదంలో సమాధానం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంగ్లిష్‌ వైద్యంతో పోల్చితే ఆయుర్వేద వైద్యం వ్యాధులను త్వరగా నయం చేస్తుంది. ఆయుర్వేదంలో పసుపు, అల్లానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంద. ఈ రెండు ఎన్నో రకాల వ్యాధులకు చెక్‌ పెట్టడంలో సహాయపడుతుంది. అందుకే తీసుకునే ఆహారంలో కచ్చితంగా పసుపు, అల్లం ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. దాదాపు మనం ఉపయోగించే ప్రతీ కూరలో ఈ రెండు ఉంటాయి. అయితే పసుపు, అల్లం పొడిని కలిపి తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయాంటే. 

జీర్ణ సమస్యలు 

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కడుపుబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సమస్యకు చెక్‌ పెట్టడంలో అల్లం, పసుపు దివ్యౌషధంగా పనిచేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్‌ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అలాగే అల్లంలో జింజరాల్‌ కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్‌. దీంతో ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. కడుపు ఉబ్బరం తగ్గి హాయిగా ఉంటుంది. 

కొలెస్ట్రాల్‌కు చెక్‌ 

శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ తగ్గడంలో కూడా పసుపు, అల్లం ఎంతో ఉపయోగపడుతుంది. పసుపు, అల్లం పొడిని కలిపి తీసుకుంటే ధమనుల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది. దీంతో రక్తపోటును అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. 

జ్ఞాపకశక్తి.. 

మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా అల్లం, పసుపు పొడి బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పసుపులోని కర్కుమిన్‌ సమ్మేళనం మెదడు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ముఖ్యంగా చిన్నారుల్లో జ్ఞాపకశక్తిని పెంచడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 


రోగనిరోధక శక్తి 

అల్లం, పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని విటమిన్‌ సి, మెగ్నీషియం, కాపర్‌, విటమిన్‌ ఈ, విటమిన్‌ కే రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పసుపు, అల్లం పొడిని పాలలో కలుపుకొని తీసుకోవడం వల్ల తరచూ వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. కండరాల నొప్పులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios