కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకాల్లో ఆయుష్మాన్‌ భారత్‌ ఒకటి. ఈ పథకాన్ని ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (PMJAY) అని కూడా పిలుస్తారు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలు ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డు సహాయంతో, 30 వేలకు పైగా ఆసుపత్రులలో రూ.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స పొందవచ్చు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

ఆయుష్మాన్ కార్డ్ అంటే ఏమిటి? 

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) కింద నమోదు చేసుకున్న వ్యక్తులకు ఆయుష్మాన్ కార్డు ఇస్తారు. ఆయుష్మాన్ భారత్ యోజన భారతదేశంలోని 40% పేదలకు ఉచిత ఆరోగ్య కవరేజీని అందిస్తుంది. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018 సెప్టెంబర్ 23న జార్ఖండ్‌లోని రాంచీలో ప్రారంభించారు. ఈ పథకం కింద, కుటుంబాలకు ప్రతి సంవత్సరం రూ. 5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స పొందే అవకాశం లభిస్తుంది. ఈ కార్డులో 9000 వ్యాధులు కవర్  అవుతాయి. ప్రపంచంలో ప్రభుత్వ నిధులతో నడిచే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంగా రికార్డుల్లోకి ఎక్కింది. 

ఆయిష్మాన్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న సేవలు: 

లింక్ ఆధార్: ఆయుష్మాన్ కార్డ్ లబ్ధిదారులు ఆధార్ eKYC ప్రక్రియ లేకుండానే తమ ఆధార్ నంబర్‌ను లింక్ చేయవచ్చు. 

యాడింగ్‌: ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న కుటుంబంలో కొత్త సభ్యులను యాడ్‌ చేసుకోవచ్చు. 

రీ-ఈకేవైసీ: లబ్ధిదారులు కొత్త ఫోటో, అడ్రస్‌ను మార్చుకోవచ్చు. 

స్టేటస్ చెక్‌: మీ ఆయుష్మాన్ కార్డు స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. 

ఆయుష్మాన్ కార్డు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? 

* మట్టి గోడలు, పైకప్పులతో ఒక గది ఇళ్ళు కలిగిన వారు. 

* కుటుంబంలో వయోజన పురుష సభ్యులు లేకుండా 16-59 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు కూడా ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజనకు అర్హులు.

* వికలాంగులు ఉన్న కుటుంబాలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

* ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజనకు SC/ST కుటుంబాలు అర్హులు. 

* భూమి లేని వారు, కూలీలుగా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. 

* పట్టణ ప్రాంతాల్లో నివసించే.. చెత్త ఏరుకునేవారు, యాచకులు, గృహ సహాయకులు, పారిశుధ్య కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, మెకానిక్‌లు, మరమ్మతు కార్మికులు, వీధి వ్యాపారులు మొదలైన వారు ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజనకు అర్హులు. మీరు వెబ్‌సైట్ నుండి మరిన్ని వివరాలను పొందవచ్చు. 


ఆయుష్మాన్ కార్డు  ప్రయోజనాలు:

* ఆసుపత్రి చికిత్స కోసం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు కవరేజ్.

* 12 కోట్ల కుటుంబాలు అంటే దాదాపు 50 కోట్ల మంది ఈ సౌకర్యం యొక్క ప్రయోజనాన్ని పొందగలరు.

* ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స పొందొచ్చు. 

* ఆసుపత్రిలో ఉండటానికి పెద్దగా డబ్బు ఖర్చు కాదు.

* ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా అవసరమైన ఆరోగ్య సేవలను పొందవచ్చు.

మీరు అర్హులేనా.? ఎలా చెక్‌ చేసుకోవాలంటే.. 

ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన అర్హతకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే, మీరు వెబ్‌సైట్‌కి వెళ్లి అర్హతను చెక్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా వెబ్‌సైట్‌కి వెళ్లి “Am I Eligible” పై క్లిక్ చేయండి. దానిపై మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. కాప్చా కోడ్‌ను నమోదు చేసి లాగిన్ అవ్వండి. ఆధార్‌, రేషన్‌ కార్డును ఎంటర్‌ చేసి సెర్చ్‌ చేయండి. మీరు ఈ పథకానికి అర్హులో లేదో తెలిసిపోతుంది. 

ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు:

ఆయుష్మాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీకు ఆధార్ కార్డు అవసరం. ఇది కాకుండా మీరు కొన్ని ఇతర పత్రాలను ఉపయోగించవచ్చు. అవేంటంటే.. 

* కుటుంబ గుర్తింపు కార్డు

* ఆధార్ కార్డు, రేషన్ కార్డు 

* ఆదాయ ధృవీకరణ పత్రం 

* అడ్రస్ ప్రూఫ్‌ 

* ముఖ్యమైన బ్యాంకు సంబంధిత పత్రాలు

ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? 

ఆన్‌లైన్‌ విధానంలో: 

* ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, మెనూ బార్‌లో “నేను అర్హత పొందానా” పై క్లిక్ చేయండి. ఇది మీకు అర్హత గురించి సమాచారాన్ని అందిస్తుంది.

* మీరు అర్హులు అయితే, NHA పోర్టల్‌ కు డైవర్ట్‌ అవుతారు. బెనిఫిషియరీ ఆప్షన్‌ను ఎంచుకుని, మీ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి.. ఫోన్‌లో వచ్చిన OTPని నమోదు చేసి లాగిన్ అవ్వండి.

* 'PMJAY' పథకాన్ని ఎంచుకున్న తర్వాత, మీ రాష్ట్రానికి సంబంధించిన వివరాలను ఎంటర్‌ చేయండి 

* తర్వాత ఆధార్‌ నెంబర్‌ను సెలక్ట్ చేసుకొని ఆధార్‌ నెంబర్‌ను టైప్ చేయాలి. 

* కుటుంబ సభ్యులందరి జాబితా ఆయుష్మాన్ కార్డులో యాడ్ చేయండి. 

* ఆయుష్మాన్ భారత్ కార్డ్ స్టేటస్ జనరేట్ కాకపోతే, మీరు 'ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి' కింద 'చర్య' సెలక్ట్ చేసుకోవాలి. 

* ఆధార్‌ నెంబర్‌ ఎంటర్‌ చేస్తే మీ రిజిస్టర్‌ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. 

* కుటుంబంలోని ఇతర సభ్యుల మొబైల్‌ నెంబర్‌తోపాటు సంబంధిత సమాచారాన్ని ఎంటర్‌ చేయాలి. 

* పూర్తి వివరాలు అందించిన తర్వాత మీ ఆయుష్మాన్‌ భారత్‌ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ఆఫ్‌లైన్‌లో ఎలా చేసుకోవాలంటే: 

ఇందుకోసం మీ సమీపంలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆదాయ సర్టిఫికెట్‌తో ఆయుష్మాన్ మిత్రను కలవండి. ఆయుష్మాన్ మిత్ర మిమ్మల్ని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతారు. మీరు ఆసుపత్రిలో అవసరమైన పత్రాలను సమర్పించాలి.

ఆయుష్మాన్ భారత్ కార్డును ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలి? 

* PMJAY-బెనిఫిషియరీ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. 

* క్యాప్చా కోడ్, మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, 'లాగిన్' బటన్‌పై క్లిక్ చేయండి. మొబైల్ కి ఒక OTP వస్తుంది.

* OTPతో పాటు మరో క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత లాగిన్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. 

* 'సెర్చ్ బై' ఆప్షన్‌లో, మీ రాష్ట్రం, జిల్లా, ఉప-పథకం, గుర్తింపు పద్ధతిని సెలక్ట్ చేసుకోవాలి. 

* అనంతరం మీ పేరును సెర్చ్‌ చేయాలి. కార్డ్‌ స్టేటస్‌ కాలమ్‌లో PMJAY కార్డ్ స్టేటస్‌ను చెక్‌ చేయాలి. 

ఆయుష్మాన్ యాప్ నుంచి స్టేటస్‌ ఎలా చెక్‌ చేయాలి.? 

* మీ మొబైల్‌లో ఆయుష్మాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

* మొంబర్‌గా లాగిన్‌ అయి కావాల్సిన సమాచారాన్ని ఎంటర్‌ చేయండి. 

* లాగిన్ అయిన తర్వాత, లబ్ధిదారుల ఎంపికపై క్లిక్ చేయండి.

* మీ రాష్ట్రం పేరు, పథకం పేరు మరియు PMJAY ID, కుటుంబ ID లేదా ఆధార్ నంబర్ వంటి వాటిని సెలక్ట్ చేసుకోండి. ఆధార్ నంబర్‌ ద్వారా కూడా తెలుసకోవచ్చు. 

* ఆధార్‌ నెంబర్‌తో లింక్‌ అయిన ఆయుష్మాన్ భారత్ కార్డుల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీని ద్వారా మీ ఆయుష్మాన్ భారత్ కార్డు స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. 

ఆయుష్మాన్ భారత్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? (ఆయుష్మాన్ కార్డ్ డౌన్‌లోడ్)

* ఆయుష్మాన్ యాప్ లేదా Beneficiary.nha.gov.in లో లబ్ధిదారుడిగా లాగిన్ అవ్వాలి. 

* ఇప్పుడు లబ్ధిదారులను సెర్చ్‌ చేయడానికి పేజీ ఓపెన్‌ అవుతుంది. 

* మీరు రాష్ట్రం, పథకం పేరు (PMJAY), PMJAY ID, కుటుంబ ID, స్థలం లేదా ఆధార్ నంబర్ ఉపయోగించి సెర్చ్‌ చేయవచ్చు. 

* ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, సెర్చ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. 

* వెంటనే ఆధార్ నెంబర్‌కి లింక్‌ చేసిన ఆయుష్మాన్‌ కార్డుల జాబితా కనిపిస్తుంది. 

* KYC పూర్తయినట్లయితే డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. 

* ఆయుష్మాన్ భారత్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీరు ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. 

* మొబైల్ ఓటీపీ వస్తుంది. 

* ఓటీపీ ఎంటర్‌ చేయగానే డౌన్‌లోడ్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. ఆయుష్మాన్ భారత్ కార్డును సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య కార్యకర్తలందరికీ ఆరోగ్య భద్రత..

 ఆయుష్మాన్ వయ వందన కార్డ్ అంటే ఏమిటి? 

ఆయుష్మాన్ వయ వందన కార్డును భారత ప్రభుత్వం అక్టోబర్ 29, 2024న ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా 70 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య కవరేజ్ అందిస్తారు. 5 లక్షల వరకు ఆరోగ్య కవరేజ్ లభిస్తుంది. ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద కవర్ అయ్యే సీనియర్ సిటిజన్లకు ప్రతి సంవత్సరం రూ. 5 లక్షల వరకు అదనపు టాప్-అప్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS), మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం (ECHS), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) వంటి పథకాలు ఉన్న వారు కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఈ పథకంలో 2,000 కంటే చికిత్సలు బీమా పరిధిలోకి వస్తాయి. 

ఇది కూడా చదవండి: ఇకపై వృద్దులకు ఉచిత వైద్యం : మోదీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఆయుష్మాన్ వే వందన కార్డ్ విజయాలు: 

ఆయుష్మాన్ వయ వందన కార్డు ప్రారంభించిన రెండు నెలల్లోనే, దాదాపు 25 లక్షల మంది సీనియర్ సిటిజన్లు ఇందులో చేరారు. 22,000 మందికి పైగా సీనియర్ సిటిజన్లు  రూ. 40 కోట్లకు పైగా విలువైన చికిత్స పొందారు.

ఆయుష్మాన్ కార్డులో అందుబాటులో ఉన్న సాధారణ చికిత్సలు:

ఆయుష్మాన్ కార్డు ప్రయోజనం పొందే వారికి దాదాపు 9000 వ్యాధులకు ఉచిత చికిత్స లభిస్తుంది. ఇందులో కవర్ అయ్యే చికిత్సలు ఇవే.. 

* కరోనరీ యాంజియోప్లాస్టీ

* తుంటి పగులు/భర్తీ

* పిత్తాశయం తొలగింపు

* కంటిశుక్లం శస్త్రచికిత్స

* ప్రోస్టేట్ విచ్ఛేదనం

* స్ట్రోక్ 

* ఎంటరిక్ జ్వరంతో పాటు ఇతర వ్యాధులకు చికిత్స పొందొచ్చు. 

ఇది కూడా చదవండి: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఇప్పటి నుంచి ఉచితంగానే..

ఆయుష్మాన్ భారత్ కార్డ్ హెల్ప్‌లైన్ నంబర్:

ఆయుష్మాన్ భారత్ కార్డుకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే, మీరు హెల్ప్‌లైన్ నంబర్ 14555 కు కాల్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. ఏదైనా ఔషధం లేదా సేవ సంబంధిత సమస్య కోసం 1800-111-565 కు కాల్ చేయవచ్చు. ఆసుపత్రిలో అదనపు డబ్బు అడిగితే ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. 

ABHA కార్డ్ అంటే ఏమిటి? 

ABHA కార్డ్ అనేది ఆరోగ్యానికి సంబంధించిన డిజిటల్ ID. ఇది ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని సురక్షితంగా ఉంచే 14 అంకెల సంఖ్యను కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్య సేవలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

ఆయుష్మాన్ భారత్ కార్డుకు సంబంధించి కొన్ని ప్రశ్నలు, సమాధానాలు.

ప్రశ్న: మొత్తం కుటుంబం ఆయుష్మాన్ భారత్ కార్డును ఉపయోగించవచ్చా?

సమాధానం: అవును, మొత్తం కుటుంబం ఆయుష్మాన్ భారత్ కార్డును ఉపయోగించవచ్చు. కుటుంబ సభ్యుడైతే అనారోగ్యానికి గురైతే రూ. లక్ష వరకు వైద్య కవరేజ్ ఇవ్వబడుతుంది.

ప్రశ్న: ఆయుష్మాన్ భారత్ కార్డు కింద ఏం కవర్‌ అవుతుంది.? 

జవాబు: ఆయుష్మాన్ భారత్ కార్డు కింద ద్వితీయ, తృతీయ ఆసుపత్రిలో చేరడానికి రూ. 5 లక్షల వరకు వైద్య కవరేజ్ అందుబాటులో ఉంది. 

ప్రశ్న: సీనియర్ సిటిజన్లు ఆయుష్మాన్ భారత్ కార్డుకు అర్హులేనా?

సమాధానం: 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతీ సీనియర్ సిటిజన్లు ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రయోజనాన్ని పొందవచ్చు.

ప్రశ్న: ఆయుష్మాన్ భారత్ కార్డు నగదు రహిత చికిత్సను అందిస్తుందా?

సమాధానం: అవును! ఆయుష్మాన్ భారత్ యోజన సౌకర్యాన్ని అందించే ఆసుపత్రులు నగదు రహిత చికిత్సను అందిస్తాయి. దీని అర్థం ఏ అనారోగ్య వ్యక్తి చికిత్స కోసం ఆసుపత్రిలో డబ్బు జమ చేయవలసిన అవసరం లేదు. కార్డు సహాయంతో మాత్రమే ఆసుపత్రిలో రూ.5 లక్షల వరకు చికిత్స అందిస్తారు. 

ప్రశ్న: ఆయుష్మాన్ భారత్ యోజన కార్డు సహాయంతో అన్ని వైద్య ఖర్చులను పొందవచ్చా?

సమాధానం: లేదు కేవలం రూ. 5 లక్షల వరకు మాత్రమే వైద్య ఖర్చులు కవర్‌ అవుతాయి. 

ప్రశ్న: ఆయుష్మాన్ భారత్ యోజన కార్డు ఉపయోగించకపోతే గడువు ముగుస్తుందా?

సమాధానం: లేదు కార్డు వ్యాలిడిటీ ముగియదు. కార్డు ఆటోమెటిక్‌గా రెనివల్‌ అవుతుంది. 

ఇది కూడా చదవండి: డిజిటల్ హెల్త్ కార్డ్ అంటే ఏమిటి..ఎలా పొందాలి..? దీని ప్రయోజనాలను ఎంటో తెలుసుకోండి..