Asianet News TeluguAsianet News Telugu

ఇకపై వృద్దులకు ఉచిత వైద్యం : మోదీ కేబినెట్ కీలక నిర్ణయాలు

మోదీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది.  ఆయుష్మాన్ భారత్ తో పాటు వివిధ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి కేబినెట్ నిర్ణయాలు వెలువడ్డాయి

Expands Ayushman Bharat to Senior Citizens: Union Cabinet Key Decisions AKP
Author
First Published Sep 11, 2024, 10:55 PM IST | Last Updated Sep 11, 2024, 11:14 PM IST

Union Cabinet Meeting : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం అయ్యింది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా దేశ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేందుకు ఏర్పాటుచేసిన ఆయుష్మాన్ భారత్ పై కీలక నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. 

ఇప్పటివరకు ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్యసేవలు అందిస్తోంది ప్రభుత్వం. అయితే ఈ వైద్య సదుపాయం 70 ఏళ్లలోపు వారికే వర్తించేంది. తాజా నిర్ణయంతో 7 ఏళ్లు పైబడిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్యసేవలు అందనున్నాయి. మోదీ సర్కార్ మానవతా దృక్ఫథంతో ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 

కేంద్ర కేబినెట్ నిర్ణయంతో దాదాపు 6 కోట్లమంది సీనియర్లు సిటిజన్స్ కు లబ్ది చేకూరుతుంది. వీరంతా రూ.5 లక్షల వరకు ఉచితంగానే చికిత్స పొందవచ్చు. ఇలా ఆయుష్మాన్ భారత్ లో వృద్దులను చేర్చడమే కాదు రూ.3,437 కోట్లను కూడా కేటాయించారు.    

కేబినెట్ నిర్ణయాలు:

జలవిద్యుత్ ప్రాజెక్టులకు రూ.12,461 కోట్లను కేటాయిస్తే కేబినెట్ నిర్ణయం తీసుకుంది.  అలాగే ప్రధాన మంత్రి గ్రామ సడక యోజనకు రూ.70,125 కోట్ల రూపాయలను కేటాయింపుకు కేబినెట్ ఆమోదం లభించింది. 

పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ పథకానికి కూడా మోదీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.10,900 కోట్లను ఇందుకోసం కేటాయించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఈ నిధులు ఉపయోగించుకోనున్నారు. వాహనాలపై సబ్సిడి కోసం, 88,500 ప్రదేశాల్లో చార్జింగ్ స్టేషన్ల కోసం ఉపయోగించనున్నారు.   

పీఎం బస్ సేవా పథకానికి రూ.3,435 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో 38వేల ఈ బస్ లను అందుబాటులోకి తేనున్నారు.ఇక వాతావరణ శాఖలో టెక్నాలజీ (మిషన్ మౌసమ్) కోసం రూ.2వేల కోట్లను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios